5వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు.. పంపనున్న భారతీయ-అమెరికన్ వైద్యులు!

ABN , First Publish Date - 2021-05-09T02:09:10+05:30 IST

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో స్వదేశానికి అండగా నిలిచేందుకు భారతీయ-అమెరికన్ వైద్యులు నడుం బిగించారు.

5వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు.. పంపనున్న భారతీయ-అమెరికన్ వైద్యులు!

వాషింగ్టన్: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో స్వదేశానికి అండగా నిలిచేందుకు భారతీయ-అమెరికన్ వైద్యులు నడుం బిగించారు. అమెరికా నుంచి భారత్‌కు 5 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపాలని వారు నిర్ణయించారు. ఈ కాన్సంట్రేటర్లను ఇప్పటికే కొనుగోలు చేసేశారట. వీటిలో 450 యూనిట్లు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకోగా.. ఢిల్లీకి 325, ముంబైకి 300 వస్తున్నాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిజీషియన్స అసోసియేషన్ (ఎఫ్‌ఐపీఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. మరో 3,500 యూనిట్లు షిప్పింగ్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భారత్‌లో కరోనా పరిస్థితి భయంకరంగా ఉంది. దీంతో చాలా దేశాలు సాధ్యమైనంత సాయం చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-05-09T02:09:10+05:30 IST