Pramila Jayapal‌కు చేదు అనుభవం.. భగ్గుమన్న ఇండియన్ అమెరికన్లు!

ABN , First Publish Date - 2022-07-14T21:34:41+05:30 IST

ఇండియన్ అమెరికన్, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఈమె జాతి వివక్ష దాడిని ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అమెరికన్లు స్పందించారు. జాతి

Pramila Jayapal‌కు చేదు అనుభవం.. భగ్గుమన్న ఇండియన్ అమెరికన్లు!

ఎన్నారై డెస్క్: ఇండియన్ అమెరికన్, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఈమె జాతి వివక్ష దాడిని ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అమెరికన్లు స్పందించారు. జాతివివక్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


సియాటెల్‌కు చెందిన 48ఏళ్ల వ్యక్తి.. శనివారం రాత్రి ప్రమీలా జయపాల్ ఇంటి వద్దకు చేరుకున్నాడు. అనంతరం అసభ్యపదాలతో ఆమెను దూషించాడు. ‘ఇండియాకు వెళ్లిపో.. లేదంటే నిన్ను చంపేస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా వెంట తెచ్చుకున్న తుపాకీతో పలుమార్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన అధికారులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులతోపాటు ఎఫ్‌బీఐ అధికారులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. 



దీనిపై ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖీజా స్పందించారు. ఈ ఘటనను  ఖండిచండంతోపాటు సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 600 చొప్పున ఆసియన్ అమెరికన్లపై గత ఏడాది 11,000 జాతి  వివక్ష దాడులు జరిగినట్టు పేర్కొన్నారు. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రమీలా జయపాల్ కుటుంబ సభ్యులతోపాటు ఇతర ఇండియన్ అమెరికన్ ప్రతినిధులకు కూడా భద్రతను పెంచాలని కోరారు. ఇదిలా ఉంటే.. ఆసియన్ అమెరికన్లపై కేవలం గత ఏడాదే.. జాతి వివక్ష దాడులు 339శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.  


Updated Date - 2022-07-14T21:34:41+05:30 IST