న్యూ ఇయర్ బహుతులు ఇచ్చిపుచ్చుకున్న భారత్-చైనా సైనికులు

ABN , First Publish Date - 2022-01-02T02:44:02+05:30 IST

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తూర్పు లడఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో భారత్..

న్యూ ఇయర్ బహుతులు ఇచ్చిపుచ్చుకున్న భారత్-చైనా సైనికులు

లడఖ్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తూర్పు లడఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో భారత్-చైనా సైనికులు పరస్పరం బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు. గతేడాది మేలో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.


ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనికులు పరస్పరం న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ బహుతులు ఇచ్చి పుచ్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైన హాట్‌స్ప్రింగ్స్  సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండగా, డెమ్‌చోక్ ప్రాంతం ప్రతిష్ఠంభనలో భాగం కానప్పటికీ అక్కడ సైనిక నిర్మాణాలు కొనసాగుతున్నాయి.


కాగా, కేకే పాస్, డీబీవో, బాటిల్‌నెక్, కోంకల, చుషూల్ మోల్డో, డెమ్‌చోక్ హాట్‌స్ప్రింగ్, నాథులా, కొంగ్రల, బుమ్‌ ల, వచా డమై ప్రాంతాల్లోనూ భారత్-చైనా సైనికులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని మిఠాయిలు పంచుకున్నారు.  

Updated Date - 2022-01-02T02:44:02+05:30 IST