Ladakh : కదులుతున్న భారత్, చైనా దళాలు

ABN , First Publish Date - 2022-09-09T00:03:55+05:30 IST

లడఖ్‌లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ పీపీ-15 నుంచి భారత్, చైనా

Ladakh : కదులుతున్న భారత్, చైనా దళాలు

న్యూఢిల్లీ : లడఖ్‌ (Ladakh)లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ పీపీ-15 నుంచి భారత్, చైనా దళాల (India, China troops) ఉపసంహరణ గురువారం ప్రారంభమైంది. ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో ఈ ఉపసంహరణ జరుగుతోందని ఇరు దేశాల సైన్యాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన పేర్కొంది. 16వ విడత కార్ప్స్ కమాండర్ లెవెల్ చర్చల్లో కుదిరిన అంగీకారం ప్రకారం ఈ ఉపసంహరణ జరుగుతోందని తెలిపింది. 


రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 16వ విడత కార్ప్స్ కమాండర్ లెవెల్ (16th round of India China Corps Commander Level) సమావేశం జూలైలో జరిగింది. ఈ సమావేశంలో కుదిరిన అంగీకారం ప్రకారం గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ (పీపీ-15) ప్రాంతం నుంచి భారత్, చైనా దళాల ఉపసంహరణ గురువారం ప్రారంభమైంది. ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో ఈ ఉపసంహరణ జరుగుతోంది. సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలు ఏర్పడటానికి ఈ ఉపసంహరణ దోహదపడుతుంది. 


Updated Date - 2022-09-09T00:03:55+05:30 IST