Eid Ul-Adha: వాఘా సరిహద్దు వద్ద స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ జవాన్లు

ABN , First Publish Date - 2022-07-10T18:22:45+05:30 IST

ఈద్ ఉల్-అధా (బక్రీద్)ను పురస్కరించుకుని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద భారత్-పాక్ సైనికులు ఈ ఉదయం

Eid Ul-Adha: వాఘా సరిహద్దు వద్ద స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ జవాన్లు

అట్టారి: ఈద్ ఉల్-అధా (బక్రీద్)ను పురస్కరించుకుని అట్టారి-వాఘా (Wagah) సరిహద్దు వద్ద భారత్-పాక్ సైనికులు ఈ ఉదయం మిఠాయిలు పంచుకున్నారు. బక్రీద్‌ (Eid Ul-Adha)ను పురస్కరించుకుని అట్టారి (Attari) సరిహద్దులో జాయింట్ చెక్‌పోస్టు వద్ద పాకిస్థాన్ రేంజర్లకు మిఠాయిలు అందించినట్టు బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్ తెలిపారు. ఇది సంప్రదాయంగా కొనసాగుతోందని అన్నారు. మన సంప్రదాయం, సద్భావన, శాంతికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. 


బక్రీద్‌ను త్యాగానికి గుర్తుగా జరుపుకుంటారు. ఇస్లామిక్ కేలెండర్‌లోని 12వ నెల అయిన ధు అల్-హిజ్జాలో పదో రోజున ఈ పండుగను జరుపుకుంటారు. హజ్ యాత్ర ముగింపును ఇది సూచిస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్‌ను బట్టి ప్రతి ఏడాది తేదీల్లో మార్పులుంటాయి. 365 రోజులు కలిగిన జార్జియన్ కేలండర్‌తో పోలిస్తే ఇస్లామిక్ క్యాలెండర్‌లో 11 రోజులు తక్కువగా ఉంటాయి. 

Updated Date - 2022-07-10T18:22:45+05:30 IST