America జైల్లో 3 నెలలుగా భారతీయ యువ క్రీడాకారుడు.. చేయని తప్పునకు బందీగా.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-12T01:04:36+05:30 IST

దేశం తరఫున ఆడాలని.. పతకాలు సాధించి మాతృభూమికి పేరు తేవాలని ఎన్నో కలలు కన్నాడు. చిన్ననాటి నుంచి కఠోరంగా శ్రమించాడు. చేసిన సాధన సరిపోదని భావించి.. మెరుగైన శిక్షణ కోసం అమెరికా వె

America జైల్లో 3 నెలలుగా భారతీయ యువ క్రీడాకారుడు.. చేయని తప్పునకు బందీగా.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: దేశం తరఫున ఆడాలని.. పతకాలు సాధించి మాతృభూమికి పేరు తేవాలని అతడు ఎన్నో కలలు కన్నాడు. చిన్ననాటి నుంచి కఠోరంగా శ్రమించాడు. చేసిన సాధన సరిపోదని భావించి.. మెరుగైన శిక్షణ కోసం అమెరికా వెళ్లాడు. అయితే అక్కడ అనూహ్యంగా జైలు పాలయ్యాడు. మూడు నెలలుగా జైలు జీవితం గడుపుతున్న భారతీయ యువ క్రీడాకారుడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన హరికేష్ చిన్నప్పటి నుంచే ఆటలపై మక్కువ ఎక్కువ. ఓ వైపు చదువుకుంటూనే అనేక పరుగుపందాల్లో పాల్గొనేందుకు సాధన చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అనేక ఇంటర్నేషనల్ మారథాన్‌లలో పాల్గొన్నాడు. రాబోయే ఒలింపిక్స్‌తోపాటు ఆసియన్, కామన్ వెల్త్ గేమ్స్‌లో విజయం సాధించడానికి శిక్షణ తీసుకోవడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ శిక్షణ తీసుకుంటూనే ఆర్థిక పరిస్థితుల కారణంగా హోటల్‌లో పని చేస్తున్నాడు. అయితే మూడు నెలల క్రితం కిడ్నాప్ కేసులో అనూహ్యంగా హరికేష్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా.. మూడు నెలలుగా భారతీయ యువ క్రీడాకారుడు జైలు జీవితం అనుభవిస్తున్నాడు. 



ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేయని తప్పుకు తమ కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారని.. ఈ విషయంలో భారత ప్రభుత్వం తమకు ఏ విధంగా సహాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకుని విడిపించడానికి ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. తమ కొడుకు క్షేమంగా ఇంటికి చేరుకునేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. హరికేష్ 2011లో నాగ్‌పూర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ మారథాన్‌లో పాల్గొన్నాడు. 2017లో అస్సాంలో జరిగిన మారథాన్‌లో కూడా పాల్గొన్నాడు. అదే ఏడాది మెక్సిలో, యూఎస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ రేస్‌లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. 


Read more