సముద్ర తీర ప్రాంత రక్షణకు Indian Coast Guard హెలికాప్టర్లు

ABN , First Publish Date - 2022-06-28T18:14:37+05:30 IST

ఇండియన్ కోస్ట్ గార్డ్ స్వదేశీ విమానం ఎఎల్‌హెచ్ మార్క్ 3 హెలికాప్టర్లను మంగళవారం ప్రవేశపెట్టింది....

సముద్ర తీర ప్రాంత రక్షణకు Indian Coast Guard హెలికాప్టర్లు

పోరుబందర్ (గుజరాత్): ఇండియన్ కోస్ట్ గార్డ్ స్వదేశీ విమానం ఎఎల్‌హెచ్ మార్క్ 3 హెలికాప్టర్లను మంగళవారం ప్రవేశపెట్టింది. ఆత్మనిర్భర్ భారత్ పట్ల ప్రభుత్వ చొరవకు అనుగుణంగా ఎఎల్‌హెచ్ మార్క్ 3 హెలికాప్టర్లను ప్రవేశపెట్టడం స్వావలంబనకు ఒక ముందడుగు అని ఇండియన్ కోస్ట్ గార్డ్ పేర్కొంది.భారతదేశ సముద్ర తీరప్రాంతంలో భద్రతను బలోపేతం చేస్తూ ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) మంగళవారం గుజరాత్‌లోని పోర్‌బందర్ పోర్ట్‌లో స్వదేశీ ఎఎల్‌హెచ్ మార్క్ 3 హెలికాప్టర్లను ప్రారంభించింది. జూన్ 20వతేదీన చెన్నైలోని ఎయిర్ స్టేషన్‌లో ఈ కొత్త హెలికాప్టరును మోహరించారు.సముద్ర తీర ప్రాంత భద్రత, నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు ఈ కొత్త హెలికాప్టర్లను ప్రవేశపెట్టామని ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక ట్వీట్‌లో పేర్కొంది.


క్యాబిన్ లో 12.7 మిల్లీమీటర్ల హెవీ మెషిన్ గన్‌ని ఉపయోగించేలా ఈ హెలికాప్టరును నిర్మించారు.గతంలో కోస్ట్ గార్డ్ పాకిస్తాన్ పడవలను అడ్డగించి, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.16 హెలికాప్టర్లలో 13 సిద్ధం చేశారు.చెన్నైలో త్వరలో 840 స్క్వాడ్రన్ ఇన్వెంటరీలో మరో మూడు ఎఎల్‌హెచ్ మార్క్ 3 హెలికాప్టర్లను ప్రవేశపెడతామని అని ఇండియన్ కోస్ట్ గార్డ్ వివరించింది.

Updated Date - 2022-06-28T18:14:37+05:30 IST