సముద్రంలో బోటు బోల్తా...ఐదుగురు మత్స్యకారులను రక్షించిన Indian Coast Guard

ABN , First Publish Date - 2022-06-30T14:08:13+05:30 IST

కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగరానికి సమీపంలోని సముద్రంలో బోటు బోల్తా పడటంతో...

సముద్రంలో బోటు బోల్తా...ఐదుగురు మత్స్యకారులను రక్షించిన Indian Coast Guard

కొచ్చి(కేరళ): కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగరానికి సమీపంలోని సముద్రంలో బోటు బోల్తా పడటంతో ఐదుగురు మత్స్యకారులను భారత తీర రక్షక దళం రక్షించింది.గల్లంతైన ఆరో మత్స్యకారుడి కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard)గాలింపు చర్యలు కొనసాగిస్తోంది.కొచ్చికి వాయువ్యంగా 42 నాటికల్ మైళ్ల దూరంలో బోల్తాపడిన బోటు బిగిలీని గమనించిన వాణిజ్య నౌక కొచ్చిలోని మారిటైమ్ రెస్క్యూ సబ్ సెంటర్‌కు సమాచారం అందించింది. బోటు పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులు తేలియాడుతున్నారు. కోస్ట్ గార్డ్ ఆ ప్రాంతానికి వెళ్లాలని ఫాస్ట్ పెట్రోలింగ్ నౌక ఆర్యమాన్‌ను ఆదేశించింది.సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారుల పడవ బోల్తా పడి మత్స్యకారులు సముద్రంలో ప్రాణాలతో పోరాడుతున్నారు.


వాణిజ్య నౌక మత్స్యకారులను రక్షించింది. ప్రస్తుతం ఉన్న ప్రతికూల సముద్రం పరిస్థితుల కారణంగా నౌకల మధ్య తరలింపు సాధ్యం కానందున, కోస్ట్ గార్డ్ మత్స్యకారులను హెలికాప్టర్ ద్వారా తీసుకొని కొచ్చి ఒడ్డుకు తీసుకువచ్చింది.ద్వారా తీసుకొని కొచ్చి ఒడ్డుకు తీసుకువచ్చింది.

Updated Date - 2022-06-30T14:08:13+05:30 IST