Kuwait: ఆస్పత్రిలో భారత వ్యక్తి ఆత్మహత్య!

ABN , First Publish Date - 2021-07-16T17:15:11+05:30 IST

కువైట్‌లోని ఫర్వానియా ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న భారత వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Kuwait: ఆస్పత్రిలో భారత వ్యక్తి ఆత్మహత్య!

కువైట్ సిటీ: కువైట్‌లోని ఫర్వానియా ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న భారత వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రి భవనం రెండో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుడు గత కొంతకాలంగా మానసిక వేదనతో బాధపడుతున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. కాగా, భారత వ్యక్తి చికిత్స పొందుతున్న విభాగంలోనే రెండు రోజుల ముందు ఓ యువకుడు చనిపోగా, అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వైద్యులతో గొడవకు దిగారు. ఇదంతా భారత వ్యక్తి దగ్గర నుంచి చూసినట్లు తెలుస్తోంది. అనంతరం మరింత మనోవేదనకు గురై భవనం రెండో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా, మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కువైట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.     

Updated Date - 2021-07-16T17:15:11+05:30 IST