దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్‌లో ఉద్యోగానికి విడుదలైన నోటిఫికేషన్

ABN , First Publish Date - 2021-03-04T16:22:50+05:30 IST

దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్‌లో ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ వింగ్‌లో అసిస్టెంట్ పోస్ట్‌‌ను భర్తీ చేసేందుకు కాన్సులేట్ జనరల్ బుధవారం నోటిఫికేషన్‌ను

దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్‌లో ఉద్యోగానికి విడుదలైన నోటిఫికేషన్

దుబాయి: దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్‌లో ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ వింగ్‌లో అసిస్టెంట్ పోస్ట్‌‌ను భర్తీ చేసేందుకు కాన్సులేట్ జనరల్ బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి సెలక్ట్ అయిన వారికి నెలకు 8500 దిర్హామ్‌(రూ. 1.68 వేలు)లకు పైగా జీతం ఇవ్వనున్నట్టు కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. 7200 దిర్హామ్‌(రూ. 1.42 లక్షలు)ల బేస్ శాలరీతో పాటు 1,368 దిర్హామ్‌(రూ. 25,700)ల అలవెన్సులు, హెల్త్ ఇన్సూరెన్స్‌ను కాన్సులేట్ ఇవ్వనుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు తప్పకుండా ఇంగ్లీషు, మీడియా అండ్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. 


మీడియా, మీడియా సంబంధిత రంగాల్లో అనుభవం ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు కాన్సులేట్ జనరల్ తెలిపింది. ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలని, అరబిక్ భాష కూడా వస్తే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్టు పేర్కొంది. ఈ పోస్ట్‌కు సెలక్ట్ అయిన వారు మీడియా సంబంధిత వ్యవహారలను చూసుకోవాల్సి ఉంటుందని కాన్సులేట్ జనరల్ చెప్పింది. ఆసక్తి కలిగిన వారు కాన్సులేట్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలని కోరింది. ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేసేందుకు మార్చి 14 చివరి తేదీ అని, షార్ట్‌లిస్ట్ అయిన వారికి మాత్రమే ఇంటర్వ్యూ కాల్ వస్తుందని స్పష్టం చేసింది. భారతదేశంలో ఉంటున్న వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని కాన్సులేట్ జనరల్ వెల్లడించింది.

Updated Date - 2021-03-04T16:22:50+05:30 IST