’తగ్గేదేలే’ అంటోన్న హార్దిక్ పాండ్యా.. ‘శ్రీ వల్లీ’ పాటకు ఎవరితో స్టెప్పులేశాడంటే..

Published: Wed, 26 Jan 2022 19:49:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తగ్గేదేలే అంటోన్న హార్దిక్ పాండ్యా.. శ్రీ వల్లీ పాటకు ఎవరితో స్టెప్పులేశాడంటే..

‘పుష్ప’ మేనియా ఇప్పట్లో తగ్గెల కనిపించడం లేదు. ఆ సినిమా విడుదలైన దగ్గరి నుంచి క్రికెటర్లలందరూ హడావుడి చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘శ్రీ వల్లీ’ పాటకు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. డ్వేన్ బ్రావో కూడా ఆ పాటకు స్టెప్పులేశాడు. తాజాగా భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతడు తన నాన్నమ్మతో కలిసి ఆ పాటకు స్టెప్పులేశాడు. ‘‘మా పుష్ప నానమ్మ’’ అంటూ కామెంట్ రాశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా కామెంట్ చేస్తన్నారు. దాదాపుగా 16లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు.  


‘పుష్ప: పార్ట్-1’‌లో అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాకు లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International