కువైత్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన.. ఈ నెల 22న..

ABN , First Publish Date - 2021-12-20T16:16:12+05:30 IST

కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపింది. మధ్యహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుం

కువైత్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన.. ఈ నెల 22న..

ఎన్నారై డెస్క్: కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపింది. మధ్యహ్నం 3.30 గంటలకు ఈ  కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొంది. కువైత్‌లో పని చేస్తున్న ఇంజినీర్లు, నర్సుల సమస్యలపై ఈ కార్యక్రమంలో అంబాసిడర్ సిబి జార్జి చర్చించనున్నట్టు తెలిపింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు.. ఎంబసీ కార్యలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసే ఈ  కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకావొచ్చని తెలిపింది. ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొనదలచిన భారతీయులు community.kuwait@mea.gov.in‌కు  మొయిల్ పంపి రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. భారతీయులు ఎవరైనా ఇతర సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే.. వారి సమస్యను పాస్‌పోర్ట్ నెంబర్, పేరు, సివిల్ ఐడీ నెంబర్, ఫోన్ నంబర్ వివరాలతో మెయిల్ చేయాలని తెలిపింది. 




Updated Date - 2021-12-20T16:16:12+05:30 IST