Chinaలోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన.. భారత పౌరుల కోసం ఎమర్జెన్సీ నెంబర్లు విడుదల!

ABN , First Publish Date - 2022-04-13T20:45:08+05:30 IST

పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీలో ఉన్న భారతీయులను ఉద్దేశించి అక్కడి ఇండియన్ ఎంబసీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. అత్యవసర సమయంలో భారత పౌరులు తమను ఫోన్ ద్వారా సంప్రదించాలని సూ

Chinaలోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన.. భారత పౌరుల కోసం ఎమర్జెన్సీ నెంబర్లు విడుదల!

ఎన్నారై డెస్క్: పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీలో ఉన్న భారతీయులను ఉద్దేశించి అక్కడి ఇండియన్ ఎంబసీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. అత్యవసర సమయంలో భారత పౌరులు తమను ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించింది. ఇందుకోసం ఫోన్ నెంబర్లను కూడా విడుదల చేసింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు కొవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా చైనా ఫైనాన్షియన్ హబ్ అయిన షాంఘైలో వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం చర్యలకు చేపట్టింది. షాంఘై వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. దీంతో షాంఘైలో ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఇన్ పర్సన్ కాన్సులర్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించింది. అంతేకాకుండా అత్యవసర సేవల కోసం 8618930314575/ 18317160736 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది. లేదంటే బీజింగ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించొచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే.. మంగళవారం నాటికి చైనాలో నమోదైన కేసుల సంఖ్య 26వేలకు చేరగా.. ఇందులో అత్యధికంగా 25వేల కేసులు కేవలం షాంఘైలోనే నమోదయ్యాయి. 




Updated Date - 2022-04-13T20:45:08+05:30 IST