Kuwait లోని Indian Embassy కీలక నిర్ణయం.. ఆ రెండు రోజులు సర్వీసులన్నీ బంద్!

ABN , First Publish Date - 2021-09-07T15:49:37+05:30 IST

కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం నీట్-2021 పరీక్ష సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది.

Kuwait లోని Indian Embassy కీలక నిర్ణయం.. ఆ రెండు రోజులు సర్వీసులన్నీ బంద్!

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం నీట్-2021 పరీక్ష సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ ఉన్న ఈ నెల 9, 12 తేదీల్లో అన్ని పబ్లిక్ సర్వీసులను క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించింది. అయితే, ఎమర్జెన్సీ కాన్సులర్ సర్వీసులు మాత్రం యథావిధిగా ఉంటాయని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది. అలాగే సీకేజీఎస్ అబ్బాసీయా, సీకేజీఎస్ ఫహహీల్, సీకేజీఎస్ షార్క్‌లోని మూడు పాస్‌పోర్ట్, వీసా అవుట్‌సోర్సింగ్ కేంద్రాలు కూడా తెరిచి ఉంటాయని ఎంబసీ తెలిపింది. సెప్టెంబర్ 12న(ఆదివారం) భారత ఎంబసీలో నీట్ పరీక్ష ఉన్న విషయం తెలిసిందే.


కాగా, భారత ప్రభుత్వం ఇండియాలో కాకుండా బయటి దేశంలో నీట్ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. అది కూడా కువైత్‌కు కేటాయించింది. ఇలా భారత్‌కు వెలుపల మొదటి కేంద్రంగా కువైత్‌ను కేటాయించడంతో ఆ దేశంలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు భారీ ప్రయోజనం కలుగునుంది. ముఖ్యంగా ప్రస్తుత మహమ్మారి సమయంలో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నందున అక్కడి భారతీయ విద్యార్థులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించే విషయం. ఈ నేపథ్యంలో కువైత్‌లోని మన విద్యార్థులు భారత ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-09-07T15:49:37+05:30 IST