ఖతార్‌కు మెడిసిన్స్ తీసుకెళ్లే భారతీయులకు ఎంబసీ కీలక సూచన!

ABN , First Publish Date - 2021-08-20T13:44:21+05:30 IST

ఇండియా నుంచి ఖతార్ వెళ్లే భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ మెడిసిన్స్ తీసుకెళ్లే విషయంలో తాజాగా కీలక సూచన చేసింది. నార్కోటిక్స్ లేదా సైకోట్రోపిక్ పదార్థాలు కలిగి ఉన్న మందుల్ని తీసుకురావడం ఖతార్‌ నిషేధించిందని ఎంబసీ స్పష్టం చేసింది.

ఖతార్‌కు మెడిసిన్స్ తీసుకెళ్లే భారతీయులకు ఎంబసీ కీలక సూచన!

దోహా: ఇండియా నుంచి ఖతార్ వెళ్లే భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ మెడిసిన్స్ తీసుకెళ్లే విషయంలో తాజాగా కీలక సూచన చేసింది. నార్కోటిక్స్ లేదా సైకోట్రోపిక్ పదార్థాలు కలిగి ఉన్న మందుల్ని తీసుకురావడం ఖతార్‌ నిషేధించిందని ఎంబసీ స్పష్టం చేసింది. లిరికా, ట్రామాడోల్, అల్ప్రజోలం (జానాక్స్), డయాజెపం (వాలియం), జోలం, క్లోనాజెపం, జోల్పిడెం, కోడైన్, మెథడోన్, ప్రీగాబాలిన్ వంటి మందులు ఈ కేటగిరీలోకి వస్తాయని తెలిపింది. కనుక సాధ్యమైనంత వరకు ఈ మందుల్ని ఖతార్ తీసుకురావద్దని భారత ఎంబసీ పేర్కొంది. రాయబార కార్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో నిషేధిత మందుల వివరాలు ఉంటాయని, ఖతార్ వచ్చేముందు ఒకసారి https://indianembassyqatar.gov.in/ లింక్ ద్వారా చెక్ చేసుకోవాలని కోరింది.


ఇక నిషేధిత మందుల్ని తీసుకువస్తే అరెస్ట్ కావడంతో పాటు జైలుకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే నిషేధిత మెడిసిన్స్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం తీసుకురావొద్దని తెలిపింది. సరైన ప్రిస్క్రిప్షన్‌(30 రోజుల వ్యవధి దాటని)తో గుర్తింపు పొందిన ఆస్పత్రుల నుంచి తీసుకున్న నిషేధం లేని మందుల్ని ప్రయాణికులు తమ వెంట తెచ్చుకోవచ్చని ఎంబసీ స్పష్టం చేసింది.  

Updated Date - 2021-08-20T13:44:21+05:30 IST