Kuwait: కువైత్‌లోని ప్రవాసులకు ముఖ్య గమనిక.. రేపే ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో..

Published: Tue, 26 Jul 2022 13:40:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Kuwait: కువైత్‌లోని ప్రవాసులకు ముఖ్య గమనిక.. రేపే ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో..

కువైత్ సిటీ: కువైత్‌ (Kuwait)లోని  భారత ఎంబసీ (Indian Embassy) రేపు (బుధవారం) ఓపెన్ హౌస్ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రాయబార కార్యాలయం ప్రాంగణంలో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల(కువైత్ కాలమానం ప్రకారం) వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కువైత్‌లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి ఆహ్వానితులే. అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం లేదని ఈ సందర్భంగా ఎంబసీ స్పష్టం చేసింది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా ఎంబసీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎంబసీ వద్ద ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు వీలు కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్‌పోర్టు నం., సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైత్‌లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన [email protected] కు ఈ-మెయిల్ చేయాలి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.