Kuwait లోని ప్రవాసులకు ముఖ్య గమనిక.. జూన్ 1వ తారీఖున ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో..

ABN , First Publish Date - 2022-05-31T17:41:13+05:30 IST

కువైత్‌లోని భారత ఎంబసీ బుధవారం(జూన్ 1వ తారీఖు) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

Kuwait లోని ప్రవాసులకు ముఖ్య గమనిక.. జూన్ 1వ తారీఖున ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో..

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత ఎంబసీ బుధవారం(జూన్ 1వ తారీఖు) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. భారత రాయబారి సిబి జార్జ్‌ ఈ కార్యక్రమం ద్వారా కువైత్‌లోని భారత ప్రవాసుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చిస్తారు. ఆలివ్ సూపర్ మార్కెట్ భవనం, జ్లీబ్ అల్ షుయూక్ (అబ్బాసియా)లోని బీఎల్‌ఎస్ ఔట్‌సోర్సింగ్ సెంటర్‌లో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల(కువైత్ కాలమానం ప్రకారం) వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కువైత్‌లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి ఆహ్వానితులే. అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం లేదని ఎంబసీ వెల్లడించింది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా ఫహహీల్‌లోని బీఎల్‌ఎస్ ఔట్‌సోర్సింగ్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్‌పోర్టు నం., సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైత్‌లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన amboff.kuwait@mea.gov.in కు ఈ-మెయిల్ చేయాలి. 

Updated Date - 2022-05-31T17:41:13+05:30 IST