‘చీర్4ఇండియా’ క్యాంపెయిన్‌లో చేరిన ఇండియన్ ఎంబసీ.. కువైట్‌లో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-07-20T14:32:43+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో పోటీ పడే భారతీయ అథ్లెట్లకు మద్దతుగా జరుగుతున్న‘చీర్4ఇండియా’ క్యాంపెయిన్‌లో

‘చీర్4ఇండియా’ క్యాంపెయిన్‌లో చేరిన ఇండియన్ ఎంబసీ.. కువైట్‌లో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు

కువైట్: టోక్యో ఒలింపిక్స్‌లో పోటీ పడే భారతీయ అథ్లెట్లకు మద్దతుగా జరుగుతున్న‘చీర్4ఇండియా’ క్యాంపెయిన్‌లో భారత ఎంబసీ కూడా చేరింది. కువైట్‌లోని ఎంబసీ పరిసరాల్లో దీనికోసం ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలు సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చని, తద్వారా ఆగస్టు నుంచి జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తమ మద్దతు తెలుపవచ్చని ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఈ విధంగా ఇప్పటికే భారతదేశంలో పలుచోట్ల సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత రాయబారి శ్రీ సిబి జార్జ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నో కష్టాలను అధిగమించిన భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఎంబసీ, కువైట్‌లోని భారతీయులు కూడా అథ్లెట్లకు మద్దతుగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-07-20T14:32:43+05:30 IST