Sharjah నుంచి స్వదేశానికి తిరిగి వస్తూ.. విమానంలోనే మృతిచెందిన భారత ప్రవాసుడు

ABN , First Publish Date - 2022-06-14T18:59:24+05:30 IST

షార్జా నుంచి మూడేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వస్తున్న ఓ భారత ప్రవాసుడు అనారోగ్యం కారణంగా విమానంలోనే మృతిచెందాడు.

Sharjah నుంచి స్వదేశానికి తిరిగి వస్తూ.. విమానంలోనే మృతిచెందిన భారత ప్రవాసుడు

కాలికట్: షార్జా నుంచి మూడేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వస్తున్న ఓ భారత ప్రవాసుడు అనారోగ్యం కారణంగా విమానంలోనే మృతిచెందాడు. కేరళకు చెందిన 40 ఏళ్ల మహమ్మద్ ఫైజల్ యూఏఈలో ఓ బేకరీ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి నుంచి వెళ్లి మూడేళ్లు కావడంతో ఒకసారి స్వదేశానికి వెళ్లిరావాలని ఫైజల్ శనివారం షార్జా నుంచి కోజికోడ్‌కు విమానం ఎక్కాడు. బోర్డింగ్ సమయంలో బాగానే ఉన్నాడు. కానీ, ఇంకా కొన్ని నిమిషాల్లో విమానం ల్యాండ్ అవుతుందనగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే విమానంలోని సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం విమానం కాలికట్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే ఫైజల్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. 


ఫైజల్‌తో పాటు షార్జాలో ఉండే అతని కజిన్ బ్రదర్ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ.. అతడు కొంతకాలంగా మెదడు సంబంధిత డిసీజ్‌తో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇటీవల ఆ వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో చికిత్స కోసం స్వదేశానికి వెళ్తున్నట్లు తనతో చెప్పినట్లు సమద్ తెలిపాడు. మరో సోదరుడు హరిస్ మాట్లాడుతూ ఫైజల్ వస్తున్నాడని తెలియడంతో అతని భార్య, పిల్లలను తీసుకుని ఉదయమే కాలికట్ విమానాశ్రయానికి చేరుకున్నానని, కానీ ఇలా విగతజీవిగా కనిపించడంతో షాక్ అయ్యామని తెలిపాడు.   

Updated Date - 2022-06-14T18:59:24+05:30 IST