ఏకంగా 2 కోట్ల రూపాయల డబ్బు లిఫ్ట్‌లో దొరికితే మీరేం చేస్తారు..? ఈ కుర్రాడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-06-06T22:23:04+05:30 IST

మీకు 2 కోట్ల రూపాయలు దొరికితే ఏం చేస్తారు?

ఏకంగా 2 కోట్ల రూపాయల డబ్బు లిఫ్ట్‌లో దొరికితే మీరేం చేస్తారు..? ఈ కుర్రాడు ఏం చేశాడంటే..

మీకు 2 కోట్ల రూపాయలు దొరికితే ఏం చేస్తారు? మీరేం చేస్తారో తెలియదు కానీ.. దుబాయ్‌లో పని చేస్తున్న ఓ ప్రవాస భారతీయుడు మాత్రం ఆ డబ్బును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. వారి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. భారత సంతతికి చెందిన తారిఖ్ మహమూద్ దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ఆదివారం అతను తన భవనంలోని లిఫ్ట్‌లో వెళుతుండగా పది లక్షల దిర్హామ్‌లు (దాదాపు 2.11 కోట్ల రూపాయలు) ఉన్న బ్యాగ్ కనిపించింది. 



ఆ డబ్బును మహమూద్ తన ఖర్చుల కోసం ఉపయోగించుకోకుండా నిజాయితీగా తీసుకెళ్లి అల్ బర్షా పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. అతడి నిజాయితీని పోలీసులు మెచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్ డైరెక్టర్, బ్రిగేడియర్ అబ్దుల్ రహీమ్ బిన్ షఫీ.. మహమూద్ నిజాయితీని మెచ్చుకుని ప్రశంసా పత్రాన్ని అందించారు. అతని నైతిక విలువలు చూసి తాము చాలా గర్విస్తున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-06T22:23:04+05:30 IST