Abu Dhabi Big Ticket: భారతీయుడికి జాక్‌పాట్..!

ABN , First Publish Date - 2022-03-19T14:49:32+05:30 IST

అబుదాబి బిగ్ టికెట్‌లో భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది.

Abu Dhabi Big Ticket: భారతీయుడికి జాక్‌పాట్..!

అబుదాబి: అబుదాబి బిగ్ టికెట్‌లో భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. ఖతార్‌లో ఉండే భారత ప్రవాసుడు షంసీర్ పురక్కల్ అబుదాబిలో తాజాగా నిర్వహించిన వీక్లీ ఎలక్ట్రానిక్ డ్రాలో ఏకంగా 3లక్షల దిర్హమ్స్(మన కరెన్సీలో సుమారు రూ.62లక్షలు) గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఖతార్ ఉంటున్న షంసీర్ 2017లో యూఏఈలో ఉన్నప్పటి నుంచి అబుదాబి బిగ్‌టికెట్ రాఫెల్ పాల్గొంటున్నట్లు తెలిపాడు. 2022 తనకు బాగా కలిసొచ్చిందని చెప్పిన అతడు.. ఏడాది క్రితం తనకు వివాహమైందని, ఇప్పుడు తన భార్య మూడు నెలల ప్రగ్నెంట్‌ అని చెప్పుకొచ్చాడు. 


ఇప్పుడు భారీ మొత్తం గెలుచుకోవడంతో 2022 ఏడాది తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మురిసిపోతున్నాడు. ఇక తాను గెలుచుకున్న భారీ మొత్తంలో కొంత భాగాన్ని తన ఎంబీఏ కోర్సును పూర్తి చేసుకోవడానికి ఉపయోగించనున్నట్లు పేర్కొన్నాడు. అటు ఏప్రిల్ 3న బిగ్‌టికెట్ వారు తీయనున్న 15 మిలియన్ల దిర్హమ్స్ బిగ్‌మనీ డ్రా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇందులో కూడా తనకు అదృష్టం కలిసి వస్తుందని షంసీర్ ఆశాభావంతో ఉన్నాడు.    

Updated Date - 2022-03-19T14:49:32+05:30 IST