Abu Dhabi Big Ticket: భారతీయ మహిళకు జాక్‌పాట్.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.44కోట్లు!

ABN , First Publish Date - 2022-02-04T16:13:00+05:30 IST

అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో ఓ భారతీయ మహిళకు జాక్‌పాట్ తగిలింది. దాంతో ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా 22 మిలియన్ దిర్హమ్స్(రూ.44.75కోట్లు) గెలుచుకుంది. అబుదాబిలో నివాసముండే లీనా జలాల్ అనే భారతీయురాలు గురువారం తీసిన బిగ్ టికెట్ డ్రాలో ఇలా జాక్‌పాట్ కొట్టింది. ఇంకేముంది.. రాత్రికి రాత్రే లీనా ఖాతాలోకి రూ.44.75కోట్లు వచ్చి పడ్డాయి.

Abu Dhabi Big Ticket: భారతీయ మహిళకు జాక్‌పాట్.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.44కోట్లు!

అబుదాబి: అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో ఓ భారతీయ మహిళకు జాక్‌పాట్ తగిలింది. దాంతో ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా 22 మిలియన్ దిర్హమ్స్(రూ.44.75కోట్లు) గెలుచుకుంది. అబుదాబిలో నివాసముండే లీనా జలాల్ అనే భారతీయురాలు గురువారం తీసిన బిగ్ టికెట్ డ్రాలో ఇలా జాక్‌పాట్ కొట్టింది. ఇంకేముంది.. రాత్రికి రాత్రే లీనా ఖాతాలోకి రూ.44.75కోట్లు వచ్చి పడ్డాయి. కేరళ రాష్ట్రం త్రిచూర్‌కు చెందిన లీనా జలాల్ మరో 10 మంది స్నేహితులతో కలిసి ఇటీవల కొనుగోలు చేసిన టికెట్ నం.144387 వారికి ఇలా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. లీనా గెలిచిన భారీ నగదును వీరందరూ సమానంగా పంచుకోనున్నారు. ఇక ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల లీనా ఆనందం వ్యక్తం చేసింది. "నోట మాట రావట్లేదు. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. చాలా సంతోషంగా ఉంది. బిగ్ టికెట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు" అని లీనా చెప్పింది. మొదట ఈ విషయాన్ని తన పేరెంట్స్‌కు తెలియజేయాలని, ఆ తర్వాత తనకు వచ్చే వాటాతో ఏం చేయాలో ఆలోచిస్తాని తెలిపింది. కానీ, తప్పనిసరిగా కొంత భాగం మాత్రం చారిటీకి వినియోగిస్తానంటూ చెప్పుకొచ్చింది. కాగా, ఆమె ప్రస్తుతం అబుదాబిలో హ్యూమన్ రిసోర్సెస్ ప్రొఫెషనల్‌గా విధులు నిర్వహిస్తోంది. 

Updated Date - 2022-02-04T16:13:00+05:30 IST