యూఏఈలో సీజేఐ ఎన్వీ రమణ.. ప్రవాసుల ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-03-17T13:16:19+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తొలిసారి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్నారు. ఓ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించడానికి జస్టిస్‌ రమణ బుధవారం దుబాయి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ప్రవాసులు స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అబుదాబిలోని ఇండియన్‌ సోషల్‌ కల్చరల్‌ సెంటర్‌లో..

యూఏఈలో సీజేఐ ఎన్వీ రమణ.. ప్రవాసుల ఘన స్వాగతం

దుబాయి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రవాసులు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తొలిసారి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్నారు. ఓ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించడానికి జస్టిస్‌ రమణ బుధవారం దుబాయి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ప్రవాసులు స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అబుదాబిలోని ఇండియన్‌ సోషల్‌ కల్చరల్‌ సెంటర్‌లో జస్టిస్‌ రమణకు ప్రవాసీయులు విందు ఇస్తున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే ప్రవాసీయులు దుబాయిలోని గుండిమేడ దినూ (ఫోన్‌ నం.00971582842776)ను సంప్రదించవచ్చు. రెండు రోజుల పాటు దుబాయి, అబుదాబిలో జస్టిస్‌ ఎన్వీ రమణపర్యటిస్తారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల నెలకొల్పిన ఇంటర్నేషనల్‌ ఆర్బిటేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) ప్రాధాన్యం గురించి కూడా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడతారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు డి.వై.చంద్రచూడ్‌, ఎల్‌.నాగేశ్వర రావు, హిమా కోహ్లీ, యూఏఈలోని భారత దౌత్యాధికారి సంజయ్‌ సుధీర్‌ కూడా ప్రసంగిస్తారు.

Updated Date - 2022-03-17T13:16:19+05:30 IST