అక్రమంగా ప్రవేశించారని శ్రీలంకలో భారతీయుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-05-14T22:42:51+05:30 IST

అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించారనే కారణంతో ఒకే కుటుంబానికి నలుగురు భారతీయులను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పూర్తి వివరాల్లో

అక్రమంగా ప్రవేశించారని శ్రీలంకలో భారతీయుల అరెస్ట్

కొలంబో: అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించారనే కారణంతో ఒకే కుటుంబానికి నలుగురు భారతీయులను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మే 6న శ్రీలంకలోకి అక్రమంగా ప్రవేశించి జఫ్నా పట్టణంలోని గురునగర్ ప్రాంతంలో నివసిస్తున్న 61ఏళ్ల మహిళతోపాటు ఆమె 34ఏళ్ల కూతురుని ఇద్దరు పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆ దేశానికి చెందిన డీఐజీ అజిత్ రోహనా తాజాగా వెల్లడించారు. శ్రీలంకలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు ఇమ్మిగ్రేషన్, క్వారెంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన నేరం కింద వారిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. వారిని రామేశ్వరం ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించినట్టు తెలిపారు. చేపల వేటకు ఉపయోగించే బోటు ద్వారా వాళ్లు శ్రీలంకలోకి అడుగుపెట్టారని చెప్పారు. 


Updated Date - 2021-05-14T22:42:51+05:30 IST