అమెరికా వీధుల్లో బాలీవుడ్ సాంగ్‌పై.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన భారతీయ యువతి.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2022-04-22T18:49:22+05:30 IST

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వీధుల్లో ఓ బాలీవుడ్ సాంగ్‌పై భారతీయ యువతి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

అమెరికా వీధుల్లో బాలీవుడ్ సాంగ్‌పై.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన భారతీయ యువతి.. వీడియో వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వీధుల్లో ఓ బాలీవుడ్ సాంగ్‌పై భారతీయ యువతి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఘాగ్రా-చోలీ ధరించి ఆమె చేసిన మాస్ డ్యాన్స్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీంతో ఈ వీడియోకు భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్ వచ్చి పడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వీనిత హజారి అనే భారతీయ యువతి.. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ జంటగా 2002లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'శక్తి: ది పవర్'లోని సూపర్ హిట్ సాంగ్ 'ఇష్క్ కమీనా'పై తనదైన శైలిలో మాస్ డ్యాన్స్ చేయడం వీడియోలో ఉంది.


బ్లూ కలర్ ఘాగ్రా-చోలీ ధరించి ఆమె ఈ పాటపై వేసిన మాస్ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే. పాటకు తగ్గట్టుగా హజారి చేసిన డ్యాన్స్ సింప్లీ సూపర్బ్. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఇప్పటివరకు 25వేలకు పైగా వ్యూస్, 1440 వరకు లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు హజారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రియల్ పాటలో కంటే హజారి వేసిన స్టెప్పులే బాగున్నాయంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.  



Updated Date - 2022-04-22T18:49:22+05:30 IST