
హైదరాబాద్ : భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ తన కిట్ బ్యాగ్ మిస్సింగ్‌పై తక్షణమే చర్య తీసుకోవాలని ఎయిర్ ఫ్రాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. త్వరలో జరగనున్న టోర్నీ నేపథ్యంలో... తన కిట్ బ్యాగ్ తక్షణమే కావాలంటూ ట్వీట్ చేసింది. ఆమె గోల్ఫ్ కిట్ బ్యాగ్ పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం నుండి విమానానికి చేరుకోలేదన్న విషమాన్ని ప్రస్తావిస్తూ... ట్విట్టర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. వెంటనే చర్య తీసుకోవాలని విమానయాన సంస్థలను అభ్యర్థించింది.
ఇవి కూడా చదవండి