ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు తాజా మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2022-02-24T20:56:14+05:30 IST

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు తాజా మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులు, విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసినందువల్ల ప్రత్యేక విమానాల కోసం రూపొందించిన షెడ్యూలు రద్దయిందని తెలిపింది. భారతీయులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. 


ఈ ఏర్పాట్లు ఖరారైన వెంటనే సంబంధిత సమాచారాన్ని ఇండియన్ ఎంబసీ తెలియజేస్తుందని తెలిపింది. భారతీయులను ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతాలకు పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని వేళల్లోనూ పాస్‌పోర్టులు, అవసరమైన ఇతర పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకునేందుకు ఇండియన్ ఎంబసీ వెబ్‌సైట్‌ను, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను పరిశీలించాలని చెప్పింది. అదేవిధంగా క్రింద పేర్కొన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి, వివరాలను తెలుసుకోవచ్చునని సూచించింది. 


+38 0997300428


+38 0997300483


+38 0933980327


+38 0635917881 


+38 0935046170


Updated Date - 2022-02-24T20:56:14+05:30 IST