భారత వైద్యుడికి యూఏఈ గోల్డెన్ వీసా

ABN , First Publish Date - 2021-06-14T15:12:10+05:30 IST

ఇండియాకు చెందిన హోమియోపతి వైద్యుడు డాక్టర్ సుబేర్ పీకే‌కు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందించింది. దీంతో హోమియోపతి విభాగంలో యూఏఈలో గోల్డెన్ వీసా అందుకున్న మొట్టమొదటి

భారత వైద్యుడికి యూఏఈ గోల్డెన్ వీసా

అబుధాబి: ఇండియాకు చెందిన హోమియోపతి వైద్యుడు డాక్టర్ సుబేర్ పీకే‌కు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందించింది. దీంతో హోమియోపతి విభాగంలో యూఏఈలో గోల్డెన్ వీసా అందుకున్న మొట్టమొదటి వైద్యుడిగా సుబేర్ పీకే గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు. యూఏఈ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు యూఏఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హోమియోపతి వైద్యులకు కూడా గోల్డెన్ వీసా జారీ చేయడం ద్వారా ఈ విషయం స్పష్టం అవుతోందన్నారు. తమ లాంటి నిపుణులను ప్రోత్సహించడం ద్వారా దేశం కోసం మరింత కృషి చేసేందుుకు ప్రేరణ లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 


ఇదిలా ఉంటే.. యూఏఈ ప్రభుత్వం 2003లో హోమియోపతిని ప్రత్యమ్నాయ వైద్యంగా గుర్తించింది. ఈ క్రమంలో డాక్టర్ సుబేర్ పీకే.. దాదాపు 17ఏళ్ల క్రితం యూఏఈలో హోమియోపతి డాక్టర్‌‌గా సేవలందించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సేవలను గుర్తించిన యూఏఈ ప్రభుత్వం.. గోల్డెన్ వీసా అందించింది. 


Updated Date - 2021-06-14T15:12:10+05:30 IST