Data Science and Managementలో జాయింట్ ప్రోగ్రామ్

ABN , First Publish Date - 2022-05-17T20:17:12+05:30 IST

ఇండోర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(Indian Institute of Management) (ఐఐఎంఐ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీఐ) ఉమ్మడిగా నిర్వహిస్తున్న ‘మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ డేటా సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంఎస్‌డీఎస్‌ఎం)’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌

Data Science and Managementలో జాయింట్ ప్రోగ్రామ్

ఇండోర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(Indian Institute of Management) (ఐఐఎంఐ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీఐ) ఉమ్మడిగా నిర్వహిస్తున్న ‘మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ డేటా సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంఎస్‌డీఎస్‌ఎం)’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. ఇది రెండేళ్ల వ్యవధిగల ఆన్‌లైన్‌ మాస్టర్స్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌(Online Masters Degree Program). వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు అనుకూలంగా ఉంటుంది. రెగ్యులర్‌ అభ్యర్థులూ అర్హులే. మొత్తం 200 సీట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. విదేశీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.   


ప్రోగ్రామ్‌ వివరాలు: ఇందులో ఆరు ట్రైమెస్టర్‌లు ఉంటాయి. బేసిక్‌ కోర్సులు, అడ్వాన్స్‌డ్‌ కోర్సులు పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదటి నాలుగు ట్రైమెస్టర్‌లలో ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ప్రోగ్రామింగ్‌ అండ్‌ డేటా స్ట్రక్చర్స్‌, మేథమెటికల్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ మెథడ్స్‌, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, మెషిన్‌ లెర్నింగ్‌ (ఫౌండేషన్‌, అడ్వాన్స్‌డ్‌), ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, రిసెర్చ్‌ మెథడాలజీ, మేనేజీరియల్‌ కమ్యూనికేషన్‌, ఆప్టిమైజేషన్‌, మేనేజీరియల్‌ ఎకనామిక్స్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌, ఆపరేషన్స్‌ అండ్‌ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఎథిక్స్‌, లీగల్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ బిజినెస్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, డేటా విజువలైజేషన్‌ అండ్‌ స్టోరీ టెల్లింగ్‌ కోర్సులు ఉంటాయి.  నాలుగు, అయిదు ట్రైమెస్టర్‌లలో రెండు సంస్థలు అందించే అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్లో కొన్నింటిని ఎలక్టివ్స్‌ కింద ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆరో ట్రైమెస్టర్‌లో రెండు సంస్థల ఫ్యాకల్టీ మెంబర్ల ఆధ్వర్యంలో ప్రాజెక్ట్‌ వర్క్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది.  


వారానికి 14 నుంచి 15 గంటల ఆన్‌లైన్‌ సెషన్స్‌ ఉంటాయి. ప్రతి రోజూ సాయంత్రం ఏడు గంటలనుంచి ఎనిమిది గంటల వరకు; ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు సెషన్స్‌ ఉంటాయి. శనివారాల్లో మాత్రం ఉదయం పది గంటల నలభై అయిదు నిమిషాల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు సెషన్స్‌ ఉంటాయి. ప్రోగ్రామ్‌ మొత్తానికి 900 గంటల సెషన్స్‌ నిర్దేశించారు. నెలరోజులపాటు క్యాంపస్‌ టీచింగ్‌ ఉంటుంది. 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్‌/ బీఎస్‌/ బీఫార్మసీ/ బీఆర్క్‌/ బీ డిజైన్‌/ బీఎఫ్‌టెక్‌ / నాలుగేళ్ల బీఎస్సీ / ఎమ్మెస్సీ/ ఎంసీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. గత మూడేళ్లలో నిర్వహించిన క్యాట్‌/ గేట్‌/ జీమ్యాట్‌/ జీఆర్‌ఈ/ జామ్‌ పరీక్షల్లో ఒకదానిలో అర్హత పొంది ఉండాలి.  లేదంటే ఐఐటీ ఇండోర్‌ నిర్వహించే డేటా సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (డీమ్యాట్‌) రాయాల్సి ఉంటుంది. 

ఎంపిక: జాతీయ పరీక్ష స్కోర్‌/ డీమ్యాట్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు అడ్మిషన్‌ ఇస్తారు. 


ముఖ్య సమాచారం

ప్రోగ్రామ్‌ ఫీజు: భారత అభ్యర్థులకు రూ.12 లక్షలు; విదేశీ అభ్యర్థులకు రూ.15.6 లక్షలు

దరఖాస్తు ఫీజు: భారత విద్యార్థులకు రూ.1770; విదేశీ విద్యార్థులకు రూ.2300; డీమ్యాట్‌ 2022 రాసే అభ్యర్థులు అదనంగా రూ.590లు చెల్లించాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 10 

డీమ్యాట్‌ 2022 తేదీ: జూలై 3న

అడ్మిషన్‌ రిజిస్ట్రేషన్‌: ఆగస్టు 10 నుంచి

ప్రోగ్రామ్‌ ప్రారంభం: ఆగస్టు 11 నుంచి

వెబ్‌సైట్‌: msdsm.iiti.ac.in, msdsm.iimi.ac.in

Updated Date - 2022-05-17T20:17:12+05:30 IST