IISTలో పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2022-05-17T19:35:06+05:30 IST

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది...

IISTలో పీహెచ్‌డీ

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(Indian Institute of Space Science and Technology) (ఐఐఎస్‌టీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌(PhD Program)లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, ఏవియానిక్స్‌, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌.

స్పెషలైజేషన్‌లు - సీట్లు: స్ట్రక్చరల్‌ మెకానిక్స్‌, మెషిన్‌ డిజైన్‌ అండ్‌ డైనమిక్స్‌, సాలిడ్‌ మెకానిక్స్‌, వైబ్రేషన్‌ 3; కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, హీట్‌ ట్రాన్స్‌ఫర్‌, కంబక్షన్‌ అండ్‌ ప్రొపల్షన్‌ 6; ఏరోడైనమిక్స్‌ 2; మెకానికల్‌ మెటలర్జీ - ఫిజికల్‌ మెటలర్జీ అండ్‌ ఏరోస్పేస్‌ మెటీరియల్స్‌ 1; ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌ 1; పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ 2; కంట్రోల్‌ సిస్టమ్స్‌ 1; మిషన్‌ డిజైన్‌ ఫర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ 1; సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 2; కంప్యూటర్‌ విజన్‌-మెషిన్‌ లెర్నింగ్‌ అండ్‌ డీప్‌ లెర్నింగ్‌ 2; ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ సెన్సార్‌ ఎలకా్ట్రనిక్స్‌ 1; ఆర్‌ఎఫ్‌ అండ్‌ మైక్రోవేవ్‌ ఇంజనీరింగ్‌ 2; మైక్రోఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ 3; అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ 1; కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ - కంప్యూటర్‌ విజన్‌ - సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ -మెషిన్‌ లెర్నింగ్‌ -రికగ్నిషన్‌ 2; మైక్రో అండ్‌ నానో సెన్సార్‌ 1; ఇనార్గానిక్‌ ఫంక్షనల్‌ - ఎనర్జీ స్టోరేజ్‌ మెటీరియల్స్‌ 1; బయోఆస్ట్రోనాటిక్స్‌ 1; పాలిమర్‌ నానో కంపోజిట్స్‌ 2; ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ 3; రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్‌ 3; జియాలజీ/ ప్లానెటరీ జియాలజీ 2; అట్మాస్పిరిక్‌ సైన్స్‌ 1; జెండర్‌ స్టడీస్‌ 2; ఎకనామిక్స్‌ 2, మెషిన్‌ లెర్నింగ్‌ 1, కంట్రోల్‌ థియరీ/ పార్షియల్‌ డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌ 1, క్వాంటం ఆప్టిక్స్‌ 3, కండెన్స్‌డ్‌ మ్యాటర్‌ ఫిజిక్స్‌ 4, క్వాంటం ఇన్ఫర్మేషన్‌ - క్వాంటం కంప్యూటేషన్‌ 3, అటామిక్‌ అండ్‌ మాలిక్యులర్‌ ఫిజిక్స్‌ 1, మైక్రో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీఎల్‌ఎ్‌సఐ 2, ఇనార్గానిక్‌ ఫంక్షనల్‌ /ఎనర్జీ స్టోరేజ్‌ మెటీరియల్స్‌ 2, నానో/ ఫంక్షనల్‌ మెటీరియల్స్‌ 2, బయోఫంక్షనల్‌ మెటీరియల్స్‌, పాలిమర్‌ నానో కంపోజిట్స్‌ 2, మేనేజ్‌మెంట్‌ 1, న్యూమరికల్‌ అనాలిసిస్‌ 1, ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ 1, ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ 1, ఫంక్షనల్‌ అనాలిసిస్‌ 1, క్యుములేటివ్‌ ఆల్జీబ్రా - ఆల్జీబ్రిక్‌ జామెట్రీ 1.

ఎంపిక: అభ్యర్థులను ఆన్‌లైన్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఫెలోషిప్‌ అర్హత ఉన్నవారిని నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తారు.  

  • స్క్రీనింగ్‌ టెస్ట్‌లో రెండు సెక్షన్‌లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో ఆప్టిట్యూడ్‌, ఇంటర్‌ స్థాయి మేథమెటిక్స్‌ నుంచి; రెండో సెక్షన్‌లో సంబంధిత స్పెషలైజేషన్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ టెస్ట్‌లో అర్హత పొందాలంటే ఒక్కో సెక్షన్‌లో కనీసం 30 శాతం మార్కులు రావాలి. 
  • ఆన్‌లైన్‌ టెస్ట్‌ స్కోర్‌కు 70 శాతం, ఇంటర్వ్యూకి 30 శాతం వెయిటేజీ ఉంటుంది. స్ర్కీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల్లో మొత్తమ్మీద కనీసం 60 శాతం మార్కులు రావాలి.

రిసెర్చ్‌ ఫెలోషిప్‌: స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశం పొందిన అభ్యర్థులకు సంస్థ ఫెలోషిప్‌ ఇస్తుంది. మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000; ఆ తరవాత నెలకు రూ.35,000 చెల్లిస్తారు. అభ్యర్థులు ట్యుటోరియల్స్‌ విభాగాల్లో, ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ ల్యాబ్స్‌లో, ఇతర అకడమిక్‌ యాక్టివిటీస్‌లో వారానికి ఆరు గంటలపాటు అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.

అర్హత: కనీసం 65 శాతం మార్కులతో(ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌) (ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ)/ మాస్టర్స్‌ (సైన్స్‌/ హ్యుమానిటీస్‌/ మేనేజ్‌మెంట్‌/ సోషల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు అక్టోబరు 31 నాటికి మార్కుల పత్రాలు సబ్మిట్‌ చేయాలి. ఇంజనీరింగ్‌ విభాగాలకు కనీసం 7.5 సీజీపీఏతో బీఈ/ బీటెక్‌ పూర్తి చేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి. హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ విభాగాలకు నెట్‌ స్కోర్‌ ఉండాలి. డీఎస్‌టీ/ ఇన్‌స్పయిర్‌ ఫెలోషిప్‌ లేదా యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌ లెక్చరర్‌షిప్‌ లేదా ఎన్‌బీహెచ్‌ఎం/ జెస్ట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఐఐఎస్‌టీ, ఐఐటీ సంస్థల నుంచి డ్యుయల్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌) పూర్తిచేసిన అభ్యర్థులను; విదేశీ యూనివర్సిటీల నుంచి కనీసం 8/10 సీజీపీఏ లేదా 3.6/4 సీజీపీఏతో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసినవారిని; నెట్‌ స్కోర్‌ ఉన్నవారిని గేట్‌ స్కోర్‌ నుంచి మినహాయించారు. అభ్యర్థుల వయసు జూన్‌ 7 నాటికి 35 ఏళ్లు మించకూడదు. 


దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.700; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.350

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 7

ఆన్‌లైన్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: జూన్‌ 15 

ఆన్‌లైన్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ తేదీ: జూన్‌ 23

ఫలితాలు విడుదల: జూన్‌ 30

ఇంటర్వ్యూలు: జూలై 6 నుంచి 8 వరకు

ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: జూలై 15

తరగతులు ప్రారంభం: ఆగస్టు 1 నుంచి

వెబ్‌సైట్‌: iist.ac.in

Updated Date - 2022-05-17T19:35:06+05:30 IST