Mahzooz raffle లో పాల్గొన్న మొదటిసారినే భారత కార్మికుడికి జాక్‌పాట్.. రాత్రికి రాత్రే బ్యాంకు ఖాతాలోకి రూ.20కోట్లు!

ABN , First Publish Date - 2021-12-31T16:55:07+05:30 IST

మహజూజ్ రాఫెల్ డ్రాలో ఫుజైరాలో ఉండే భారత కార్మికుడికి జాక్‌పాట్ తగిలింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 మిలియన్ దిర్హమ్స్(రూ.20.46కోట్లు) గెలుచుకున్నాడు.

Mahzooz raffle లో పాల్గొన్న మొదటిసారినే భారత కార్మికుడికి జాక్‌పాట్.. రాత్రికి రాత్రే బ్యాంకు ఖాతాలోకి రూ.20కోట్లు!

ఇంటర్నెట్ డెస్క్: మహజూజ్ రాఫెల్ డ్రాలో ఫుజైరాలో ఉండే భారత కార్మికుడికి జాక్‌పాట్ తగిలింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 మిలియన్ దిర్హమ్స్(రూ.20.46కోట్లు) గెలుచుకున్నాడు. తాజాగా నిర్వహించిన 57వ వీక్లీ డ్రాలో తినాకర్(25) అనే భారత ప్రవాసుడికి ఈ జాక్‌పాట్ తగిలింది. ఈ రాఫెల్‌లో పాల్గొన్న తొలిసారినే ఆయనకు అదృష్టం వరించడం విశేషం. ఇంకేముంది తినాకర్ ఖాతాలో రాత్రికి రాత్రే రూ.20కోట్లు వచ్చి చేరాయి. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. 


"చాలా రోజులుగా నా రూమ్‌మెట్స్ ఈ రాఫెల్‌లో పాల్గొంటున్నారు. దాంతో నాకు కూడా ఒకసారి ప్రయత్నిద్దామని అనిపించింది. వెంటనే 1, 33, 40, 45, 46 నంబర్‌తో టికెట్ కొన్నాను. మొదటిసారి కాబట్టి పెద్దగా నంబర్ల గురించి పట్టించుకోలేదు. ఏదో తోచిన నంబర్‌లను ఎంచుకున్నాను. అదే నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. వీక్లీ డ్రాలో నేను కొనుగోలు చేసిన నా ఐదు నంబర్లు మ్యాచ్ అయ్యాయి. దాంతో 10 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాను. ఇదంతా స్వర్గస్థులైన మా తాత-నాన్నమ్మల బ్లెస్సింగ్స్. వ్యవసాయ కూలీలుగా బతికే మా ఫ్యామిలీకి ఈ భారీ మొత్తం ఎంతో ఉపయోగకరం." అని తినాకర్ చెప్పుకొచ్చాడు. రెండేళ్ల క్రితం స్నేహితుల వద్ద అప్పు చేసి ఉపాధి కోసం యూఏఈ వచ్చినట్లు తెలిపాడు. రాఫెల్‌లో పాల్గొన్నప్పుడు ఇంత భారీ మొత్తం గెలుస్తానని కలలో కూడా అనుకోలేదని, నిజంగా మా కుటుంబం కష్టాలను చూసి దేవుడే కరుణించాడని తినాకర్ ఆనందం వ్యక్తం చేశాడు. 

Updated Date - 2021-12-31T16:55:07+05:30 IST