అత్తమామల పెళ్లిరోజున ఫంక్షన్ నిర్వహించిన NRI అల్లుడికి భారీ షాక్.. రూ.1.66లక్షల ఫైన్!

ABN , First Publish Date - 2021-10-27T23:01:30+05:30 IST

సింగపూర్‌లో భారత వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అత్తమామల పెళ్లిరోజున నిర్వహించిన ఫంక్షన్ అల్లుడికి భారీ షాకిచ్చింది.

అత్తమామల పెళ్లిరోజున ఫంక్షన్ నిర్వహించిన NRI అల్లుడికి భారీ షాక్.. రూ.1.66లక్షల ఫైన్!
ప్రతీకాత్మక చిత్రం..

సింగపూర్ సిటీ: సింగపూర్‌లో భారత వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అత్తమామల పెళ్లిరోజున నిర్వహించిన ఫంక్షన్ అల్లుడికి భారీ షాకిచ్చింది. జరిమానా రూపంలో అదనపు ఖర్చులను తెచ్చిపెట్టింది. భారతీయుడికి అక్కడి న్యాయస్థానం ఏకంగా 3వేల సింగపూర్ డాలర్ల(రూ.1.66లక్షలు) జరిమానా విధించింది. ఇంతకు భారత వ్యక్తికి సింగపూర్ కోర్టు ఎందుకు ఇంత భారీ ఫైన్ వేసింది? ఆయన చేసిన నేరమేంటో తెలియాలంటే మనం ఈ స్టోరీ చదవాల్సిందే.


అయితే, పంక్షన్‌కు వచ్చిన వారు గట్టిగా అరవడం, శబ్దాలు చేయడం పక్కన ఉండే వారికి వినిపించింది. దాంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదుతో రాత్రి 10 గంటల సమయంలో ఆ చోటుకు వచ్చిన పోలీసులకు చాలా మంది ఒకేచోట గుమ్మిగూడి ఉండడం కనిపించింది. వారిలో గణేషన్ కూడా ఉన్నాడు. కాగా, ఆ సమయంలో సింగపూర్ ఇంకా కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగించలేదు. ఎదైనా ఈవెంట్‌కు 8 మందికి మించి హాజరుకావొద్దనే నిబంధన కూడా అమలులో ఉంది. కానీ, గణేషన్ కరోనా నిబంధనను కాదని ఏకంగా 20కి పైగా మందితో ఈ పంక్షన్ నిర్వహించాడు. దాంతో పోలీసులు అతడిపై కరోనా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. 


తాజాగా ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు వచ్చింది. ప్రజా ఆరోగ్య రక్షణను బేఖాతరు చేస్తూ గణేషన్ చేసిన ఈ పనికి 3వేల నుంచి 4వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించాలని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రూత్ తెంగ్ న్యాయస్థానికి విన్నవించారు. దాంతో కోర్టు ఆయనకు 3వేల సింగపూర్ డాలర్ల(రూ.1.66లక్షల) జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇలా అత్తమామల పెళ్లిరోజున ఫంక్షన్ నిర్వహించిన ఎన్నారై అల్లుడికి ఊహించని షాక్ తగిలింది.           


సింగపూర్‌లో ఉండే గణేషన్ అంగుదన్(39) అనే భారత వ్యక్తి తన అత్తమామల పెళ్లిరోజును ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశాడు. దీనికోసం వారి పెళ్లిరోజు కంటే వారం ముందుగానే భారీగా ఏర్పాట్లను ప్రారంభించాడు. దీనిలో భాగంగా లిటిల్ ఇండియాగా పిలువబడే ప్రాంతంలోని లోటస్@నోర్రిస్‌లో ఏప్రిల్ 3న 700 సింగపూర్ డాలర్లు చెల్లించి మల్టీ పర్పస్ ఈవెంట్ స్పెస్ బుక్ చేశాడు. పంక్షన్‌కు కనీసం 30 మంది అతిథులు వస్తారని ఆ చోటు యజమానితో చెప్పాడు. అందుకు ఓనర్ సరేనన్నాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 10న అత్తమామల పెళ్లిరోజు రానే వచ్చింది. దాంతో ముందుగానే బుక్‌చేసి పెట్టిన ప్రత్యేక చోటుకు కుటుంబంతో కలిసి గణేషన్ చేరుకున్నాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో మరో 20 మంది అతిథులు అక్కడికి వచ్చారు. దాంతో ధూంధాంగా ఆ ఈవెంట్ జరుగుతోంది. అతిథుల రాకతో ఆ చోటంతా సందడిగా ఉంది. 

Updated Date - 2021-10-27T23:01:30+05:30 IST