లండన్, మార్చి 29 : లండన్‌లోని హైదరాబాదీ రెస్టారెంట్లో దారుణం జరిగింది. ఈస్ట్ హాంలోని హైదరాబాద్వాలా బిర్యానీ రెస్టారెంట్లో వెయిట్రె్‌సగా పనిచేస్తున్న కేరళ విద్యార్థినిని శ్రీరామ్ అంబర్ల(23) అనే హైదరాబాదీ యువకుడు కత్తితో పలుమార్లు పొడిచాడు. కస్టమర్‌గా వచ్చిన అతడికి సోనా బిజు అనే వెయిట్రెస్ ఆర్డర్ సర్వ్ చేసే క్రమంలో ఈ ఘాతుకం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. సుమారు 22 ఏళ్ల వయసుండే బిజు.. ఈస్ట్ లండన్ యూనివర్సిటీలో చదువుతూ రెస్టారెంట్లో వెయిట్రె్‌సగా పార్ట్ టైం వర్క్ చేస్తోంది. ఈ దాడికి సంబంధించి నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
ఇవి కూడా చదవండి