పాక్‌లోని Indian High commission లో హై అలర్ట్!

ABN , First Publish Date - 2021-07-18T19:12:07+05:30 IST

పాక్‌లోని అఫ్గానిస్థాన్ దౌత్యాధికారి కుమార్తె అపహరణ ప్రస్తుతం అక్కడ కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బాధితురాలిని కొద్ది గంటల పాటు నిర్బంధించి ఆ తరువాత విడిచిపెట్టారు.

పాక్‌లోని Indian High commission లో హై అలర్ట్!

ఇస్లామాబాద్: పాక్‌లోని అఫ్గానిస్థాన్ దౌత్యాధికారి కుమార్తె అపహరణ ప్రస్తుతం అక్కడ కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బాధితురాలిని కొద్ది గంటల పాటు నిర్బంధించి ఆ తరువాత విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో పాక్‌లోని భారత హైకమిషన్‌‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. హైకమిషన్‌లో ప్రస్తుతం హైఅలర్ట్ వాతావరణం నెలకొంది. అక్కడి సిబ్బంది, వారి కుటుంబసభ్యులు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ భారత ప్రభుత్వం ఆదేశించింది. భద్రతావ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించింది. కాగా.. అఫ్గాన్ విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం.. దౌత్యవేత్త కుమార్తె సిల్సిలా అలీఖిల్‌ను జులై 16న కొందరు అపహరించారు.  గుర్తుతెలియని ప్రాంతంలో ఆమెను నిర్బంధించి టార్చర్ పెట్టారని, కొన్ని గంటల తరువాత విడుదల చేశారని అఫ్గాన్ ప్రభుత్వం పేర్కొంది. నిందుతులను తక్షణం పట్టుకుని శిక్షించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో పాక్‌లోని భారత హైకమిషన్ కూడా అప్రమత్తమైంది. 

Updated Date - 2021-07-18T19:12:07+05:30 IST