విశాఖలో ఏఎల్‌హెచ్‌ స్క్వాడ్రన్‌ 324 ప్రారంభం

Published: Tue, 05 Jul 2022 02:52:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విశాఖలో ఏఎల్‌హెచ్‌ స్క్వాడ్రన్‌ 324 ప్రారంభం

విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ నేవల్‌ ఎయిర్‌ స్క్వాడ్రన్‌ 324 విశాఖపట్నం ఐఎన్‌ఎస్‌ డేగాలో సోమవారం ప్రారంభమైంది. తూర్పు నౌకాదళం అధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా సమక్షంలో దీనిని కమిషనింగ్‌ చేశారు. ఈ స్క్వాడ్రన్‌ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌) ఎంకే-3 (ఎంఆర్‌)లను ఉపయోగిస్తుంది. వీటికి ‘కెస్ట్రెల్స్‌’ అని పక్షి జాతి పేరు పెట్టారు. గగనతలంలో విహరిస్తూ కింద ఏమున్నా గమనించడం, వెంటాడి వేటాడడం వీటి లక్షణం. విశాలమైన సముద్రంలో నిఘా, గాలింపు, రక్షణ (రెస్క్యూ) ఈ స్క్వాడ్రన్‌ లక్ష్యం. ఈ హెలికాప్టర్లను అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. మెరైన్‌ కమెండోలతో పనిచేసే వీటిని ఎయిర్‌ అంబులెన్స్‌లుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. తూర్పు తీరంలో ప్రారంభమైన తొలి స్క్వాడ్రన్‌కు కమాండర్‌ ఎస్‌ఎస్‌ దాస్‌ సారథ్యం వహించనున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.