బ్రహ్మోస్ క్షిపణులు పరీక్షించిన నేవీ

ABN , First Publish Date - 2022-03-05T22:37:12+05:30 IST

ఆధునిక బ్రహ్మోస్ క్షిపణులను భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. దూరంలోని లక్ష్యాలను చేధించగల లాంగ్‌రేంజ్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను శనివారం విజయవంతంగా పరీక్షించినట్లు నేవీ ప్రకటించింది.

బ్రహ్మోస్ క్షిపణులు పరీక్షించిన నేవీ

ఆధునిక బ్రహ్మోస్ క్షిపణులను భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. దూరంలోని లక్ష్యాలను చేధించగల లాంగ్‌రేంజ్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను శనివారం విజయవంతంగా పరీక్షించినట్లు నేవీ ప్రకటించింది. నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో పూర్తి చేసిందని నేవీ చెప్పింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తిగా దేశీయంగా తయారు చేసిన మిస్సైల్ ఇది. రష్యాతో కలిసి ఇండియా దీన్ని రూపొందించడం విశేషం. ఈ మిస్సైల్స్ భారత సైన్యానికి మరింత శక్తినిస్తాయని నేవీ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్‌లో కూడా బ్రహ్మోస్ మిస్సైల్స్‌ను విజయవంతంగా పరీక్షించారు. సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ అయిన సుఖోయ్ 30 కేఎమ్-ఐ నుంచి ఈ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు.

Updated Date - 2022-03-05T22:37:12+05:30 IST