Kuwait: గుండెపోటుతో భారతీయ నర్సు హఠాన్మరణం.. మరో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు భారత ప్రవాసులు మృతి!

ABN , First Publish Date - 2022-04-05T15:10:17+05:30 IST

కువైత్‌లో భారత్‌కు చెందిన ఓ నర్సు మృతిచెందింది. అనిత షిబు అనే 53ఏళ్ల భారతీయ నర్సు గుండెపోటుతో చనిపోయింది.

Kuwait: గుండెపోటుతో భారతీయ నర్సు హఠాన్మరణం.. మరో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు భారత ప్రవాసులు మృతి!

కువైత్ సిటీ: కువైత్‌లో భారత్‌కు చెందిన ఓ నర్సు మృతిచెందింది. అనిత షిబు అనే 53ఏళ్ల భారతీయ నర్సు గుండెపోటుతో చనిపోయింది. అనితది కేరళ రాష్ట్రం చెంగన్నూర్. ప్రస్తుతం ఆమె ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని సభా ఆస్పత్రిలోని సీసీయూలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. ఆమెకు భర్త షిబు చాకో, పిల్లలు జోషు, జోవన ఉన్నారు. అనిత మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె స్వస్థలం చెంగన్నూర్‌లో విషాదం అలుముకుంది. 


అలాగే మరో రెండు వేర్వేరు ఘటనల్లో మరో ఇద్దరు భారత ప్రవాసులు చనిపోయారు. అందులో ఒకటి సుబ్బియాలో కాగా, రెండోది మంగాఫ్‌లో చోటు చేసుకుంది. సుబ్బియాలో 43ఏళ్ల ఓ భారత వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నివాసం ఉండే చోట ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని యజమాని ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. తన వద్ద పనిచేసే డొమెస్టిక్ వర్కర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు యజమాని అంతర్గత మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది. అయితే, చనిపోయిన భారత వ్యక్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇక రెండో ఘటనలో మంగాఫ్‌లో ఉండే 37ఏళ్ల భారత ప్రవాసుడు ఇంట్లో వినియోగించి వంట గ్యాస్ లికేజీ కారణంగా చనిపోయినట్లు సమాచారం. అతని మృతదేహాన్ని అధికారులు ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   

Updated Date - 2022-04-05T15:10:17+05:30 IST