ఫ్లోరిడాలో భార్య‌ను హ‌త్య చేసిన భార‌త వ్య‌క్తి‌ అరెస్ట్..!

ABN , First Publish Date - 2020-07-29T17:26:23+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జ‌రిగింది. భార‌త సంత‌తి వ్య‌క్తి క‌ట్టుకున్న భార్య‌ను అతి కిరాత‌కంగా క‌త్తితో పొడిచి చంపేశాడు.

ఫ్లోరిడాలో భార్య‌ను హ‌త్య చేసిన భార‌త వ్య‌క్తి‌ అరెస్ట్..!

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జ‌రిగింది. భార‌త సంత‌తి వ్య‌క్తి క‌ట్టుకున్న భార్య‌ను అతి కిరాత‌కంగా క‌త్తితో పొడిచి చంపేశాడు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే... కేర‌ళ రాష్ట్రం కొట్టాయంలోని పిర్వంకు చెందిన‌ మెరిన్ జాయ్ (26)... దక్షిణ ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్‌లో గ‌ల‌ బ్రోవార్డ్ హెల్త్ హాస్పిటల్‌లో న‌ర్సుగా ప‌ని చేస్తోంది. మంగళ‌వారం నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేందుకు కారు పార్కింగ్ గ్రౌండ్‌కు వెళ్లింది. పార్కింగ్ నుంచి కారు తీసేందుకు ప్ర‌యత్నిస్తున్న ఆమెను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌త్తితో పొడిచి ప‌రార‌య్యారు. దాంతో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డింది.


ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న‌ జాయ్‌ను చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ, అప్ప‌టికే ఆమె చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. హ‌త్య కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించిన కోరల్ స్ప్రింగ్స్‌ పోలీసులకు జాయ్‌ను ఆమె భ‌ర్త ఫిలిప్ మాథ్యూనే హ‌త‌మార్చిన‌ట్లు తెలుసుకున్నారు. దాంతో ఫిలిప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ గొడ‌వ‌ల కార‌ణంగానే భార్య‌ను హ‌త్య చేసిన‌ట్లు మాథ్యూ పోలీసుల విచార‌ణ‌లో ఒప్పుకున్నాడు.  

Updated Date - 2020-07-29T17:26:23+05:30 IST