ఆస్ట్రేలియాలో భారత సంతతికి అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-12-06T14:07:51+05:30 IST

భారత సంతతి వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ యూనివర్సిటీ చాన్సలర్‌గా నియామకం అయ్యారు. ఇండియాకు చెందిన జిమ్ వర్గీస్ ఏమ్‌‌ను.. టోరెన్స్ యూనివర్సిటీ బోర్డు

ఆస్ట్రేలియాలో భారత సంతతికి అరుదైన గౌరవం

ఎన్నారై డెస్క్: భారత సంతతి వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ యూనివర్సిటీ చాన్సలర్‌గా నియామకం అయ్యారు. ఇండియాకు చెందిన జిమ్ వర్గీస్ ఏమ్‌‌ను.. టోరెన్స్ యూనివర్సిటీ బోర్డు యూనివర్సిటీ చాన్సలర్‌గా నియమించింది. 2012 నుంచి 2021 వరకూ టోరెన్స్ యూనివర్సిటీ చాన్సలర్‌గా మైఖల్ మాన్ ఏఓ పని చేశారు. జిమ్ వర్గీస్ ఏమ్‌ నియామకం పట్ల మైఖల్ మాన్  స్పందిస్తూ.. బోర్డు నిర్ణయంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు.. జిమ్ వర్గీస్ ఆస్ట్రేలియన్ పబ్లిక్ సర్వీస్‌లో పని చేశారు. క్వీన్స్‌లాండ్‌లోని ప్రైమరీ ఇండస్ట్రీస్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఇదిలా ఉంటే.. జిమ్ వర్గీస్ కుటుంబ సభ్యులు 1960ల్లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. 




Updated Date - 2021-12-06T14:07:51+05:30 IST