స్నేహితులతో కలిసి సరదాగా బీర్ తాగిన భారత సంతతి సైనిక అధికారి.. ఆ తర్వాత చిన్న తప్పు చేయడంతో ప్రస్తుతం..

ABN , First Publish Date - 2021-11-12T22:42:18+05:30 IST

భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి.. తాను చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. సరదా కోసం చేసిన ఆ పని.. అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కాగా.. ఇంతకూ ఆ భారత సంతతి వ్యక్తి ఎవరు? అతడు చేసిన తప్పు ఏంటి అనే దానికి సంబం

స్నేహితులతో కలిసి సరదాగా బీర్ తాగిన భారత సంతతి సైనిక అధికారి.. ఆ తర్వాత చిన్న తప్పు చేయడంతో ప్రస్తుతం..

సింగపూర్: భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి.. తాను చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. సరదా కోసం చేసిన ఆ పని.. అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కాగా.. ఇంతకూ ఆ భారత సంతతి వ్యక్తి ఎవరు? అతడు చేసిన తప్పు ఏంటి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


భారత సంతతికి చెందిన ఎం. రవీంద్రన్.. 2018 సెప్టెంబర్ 9న తన స్నేహితులతో కలిసి సరదాగా బీరు తాగారు. పార్టీ ముగిసిన తర్వాత తన కారును తానే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలోనే అతడు నడిపిస్తున్న కారు.. అదుపుతప్పింది. రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఆ తర్వాత రెయిలింగ్‌ను ఢీకొట్టింది. విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. అతడికి బ్రీత్ అనలైజర్ టెస్టు చేశారు. అందులో రవీంద్రన్ పరిమితికి మించి.. మద్యం సేవించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై అప్పట్లో విచారణ జరిపిన జిల్లా కోర్టు.. అతడికి జైలు శిక్షతోసహా రెండేళ్లపాటు డ్రైవింగ్‌పై నిషేధం విధించింది. అయితే రవీంద్రన్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. 



అంతేకాకుండా తనకు జరిమానా విధించాలని కోర్టును కోరాడు. అయితే కోర్టు అతడి వాదనను తోసిపుచ్చింది. దీంతో అతడు ఈ ఏడాది హైకోర్టున ఆశ్రయించాడు. ఈ సందర్భంగా తాను ఆర్మీ అధికారిగా పని చేస్తూ.. గత ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేశానని కోర్టుకు తెలిపాడు. జైలుకు వెళితే.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ కింద వచ్చే సుమారు 2,73,694 సింగపూర్ డాలర్ల (సుమారు రూ.1.5 కోట్లు)ను కోల్పోవాల్సి వస్తుందని కోర్టుకు తెలిపాడు. అందువల్ల.. తాను చేసిన తప్పుకు జరిమానా విధించాలని కోరాడు. అయితే దానికి హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా కొద్ది రోజులు జైలు జీవితం గడపాల్సిందే అంటూ తీర్పు వెలువరించింది. దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద వచ్చే రూ.1.5కోట్లను రవీంద్రన్ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. 




Updated Date - 2021-11-12T22:42:18+05:30 IST