పీకలదాక తాగి పోలీస్ అధికారులపై నోరుపారేసుకున్న భారత సంతతి వ్యక్తి.. Singapore Court విధించిన శిక్ష ఇదీ!

ABN , First Publish Date - 2021-11-28T18:24:25+05:30 IST

మద్యం మత్తులో పోలీస్ అధికారులపై నోరుపారేసుకున్న భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టు ఏడాదికి పైగా జైలు, 5500 సింగపూర్ డాలర్లు(రూ.3లక్షలు) జరిమానా విధించింది.

పీకలదాక తాగి పోలీస్ అధికారులపై నోరుపారేసుకున్న భారత సంతతి వ్యక్తి.. Singapore Court విధించిన శిక్ష ఇదీ!

సింగపూర్ సిటీ: మద్యం మత్తులో పోలీస్ అధికారులపై నోరుపారేసుకున్న భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టు ఏడాదికి పైగా జైలు, 5500 సింగపూర్ డాలర్లు(రూ.3లక్షలు) జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. సింగపూర్‌లో ఉండే క్లారెన్స్ సెల్వరాజు(47) అనే భారత సంతతి వ్యక్తి వేర్వేరు నేరాల్లో సుమారు 18 ఏళ్లు జైల్లో ఉండి ఈ ఏడాది జనవరి 2న బయటకు వచ్చాడు. జైలు నుంచి విడుదలైన కొన్ని రోజుల తర్వాత సెల్వరాజు తన ముగ్గురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ పార్టీలో పూటుగా మద్యం తాగిన సెల్వరాజు ఓ సూపర్‌మార్కెట్ వద్ద నిలబడి గట్టిగా అరవడం, వచ్చిపోయేవారిని దూషించడం చేశాడు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సెల్వరాజును అదుపులో తీసుకున్నారు. 


ఆ సమయంలో తాగినమైకంలో ఉన్న ఆయన పోలీస్ అధికారులపై నోరుపారేసుకున్నాడు. అంతేగాక సెల్వరాజు వద్ద పోలీసులు 11 గ్రాముల మాదకద్రవ్యాలను సైతం కనుగొన్నారు. అనంతరం సెల్వరాజును పరీక్షించగా అతను డ్రగ్స్ సేవించినట్లు తేలింది. దీంతో పోలీసులు అతనిపై న్యూసెన్స్, అధికారులను దూషించడం, డ్రగ్స్ సేవించడం కింద కేసు నమోదు చేశారు. మార్చి 7న ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో సెల్వరాజు తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది. తాజాగా ఈ కేసులో న్యాయస్థానం సెల్వరాజుకు శిక్షను ఖరారు చేసింది. బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ క్రియేట్ చేయడం, పోలీసు అధికారులపై నోరుపారేసుకోవడం, మాదకద్రవ్యాలు కలిగి ఉన్నందుకు ఏడాది జైలు, రూ.3లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.       


Updated Date - 2021-11-28T18:24:25+05:30 IST