Singapore: మద్యం తాగి కారు నడిపిన డ్రైవరుకు జైలు...సింగపూర్ కోర్టు తీర్పు

ABN , First Publish Date - 2022-09-06T14:07:49+05:30 IST

సింగపూర్‌(Singapore) దేశంలో పీకల దాకా మద్యం తాగి వాహనం నడుపుతూ(Drink Driving) ప్రమాదానికి కారణమైన భారతీయ సంతతికి...

Singapore: మద్యం తాగి కారు నడిపిన డ్రైవరుకు జైలు...సింగపూర్ కోర్టు తీర్పు

సింగపూర్ : సింగపూర్‌(Singapore) దేశంలో పీకల దాకా మద్యం తాగి వాహనం నడుపుతూ(Drink Driving) ప్రమాదానికి కారణమైన భారతీయ సంతతికి(Indian Origin Man) చెందిన ఓ వ్యక్తి జైలు(jail) పాలయ్యాడు.మద్యం మత్తులో అంబులెన్స్(ambulance) నడుపుతూ ప్రమాదానికి కారణమైన 27 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన జి మోహనవరూమన్ గోపాల్ ఒయ్యప్పన్‌కు సింగపూర్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.మోహనవరూమన్ కు జరిపిన పరీక్షల్లో డ్రింక్ పరిమితి కంటే రెట్టింపు మద్యం తాగాడని తేలింది. 


కరోనా నిబంధనలను సడలించాక గోపాల్ ఓ ప్రైవేటు అంబులెన్స్ నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. దీంతో దోషికి 4వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించారు. దీంతోపాటు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్టు. జైలు నుంచి విడుదల అయ్యాక దోషి 10 ఏళ్ల పాటు వాహనాలు నడపడానికి అనర్హుడిగా ప్రకటించారు. మోహనవరూమన్ గోపాల్ ఒయ్యప్పన్ జులై నెలలో మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయడం, ఒకరిని తీవ్రంగా గాయపరచడం, చెల్లుబాటు అయ్యే క్లాస్ 3 లేదా 3ఎ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి నాలుగు ఆరోపణలపై తన నేరాన్ని అంగీకరించాడు.


 


Updated Date - 2022-09-06T14:07:49+05:30 IST