Australia లో భారత సంతతి తల్లీకూతురు సరికొత్త రికార్డ్!

ABN , First Publish Date - 2022-05-20T18:20:29+05:30 IST

ఆస్ట్రేలియాలో భారత సంతతి తల్లీకూతురు సరికొత్త రికార్డు సృష్టించారు. Royal Australian Air Force లో కొలువు సాధించారు.

Australia లో భారత సంతతి తల్లీకూతురు సరికొత్త రికార్డ్!

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో భారత సంతతి తల్లీకూతురు సరికొత్త రికార్డు సృష్టించారు. Royal Australian Air Force లో కొలువు సాధించారు. దీంతో ఒకే ఫ్యామిలీ నుంచి రాయల్‌ ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చోటు సంపాదించిన తల్లీ కూతుళ్లుగా వారు రికార్డుకెక్కారు. భారత్‌కు చెందిన మంజీత్‌ కౌర్‌(తల్లి), కుశ్రూప్‌కౌర్‌ సంధు(కూతురు) ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన మంజీత్‌ కౌర్‌ తన భర్త రూప్‌సింగ్‌ సంధుతో కలిసి 2009లో స్టూడెంట్‌ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లారు. 2013లో మంజీత్‌ కౌర్‌ తన ఇద్దరు కూతళ్లతో కలిసి ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నారు. అనంతరం 2017లో RAAF లోని మెడికల్‌ వింగ్‌లో ఆమె అధికారిగా చేరారు. 


ఇక చిన్నప్పటి నుంచి తల్లిని చూస్తూ పెరిగిన కుశ్రూప్‌కౌర్ ఆమె స్ఫూర్తితోనే 12వ తరగతి పూర్తికాగానే 2022లో RAAF పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించింది. దాంతో తాజాగా ఆమెకు ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఇలా ఈ తల్లీకూతురు ద్వయం Royal Australian Air Force లో ఉద్యోగం సాధించడం నిజంగా గ్రేట్. దేశం కాని దేశంలో మంజీత్‌ కౌర్‌, కుశ్రూప్‌కౌర్ సాధించిన ఈ ఘనత పట్ల ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. స్త్రీలు ఏ రంగంలోనూ పురుషులకు తీసిపోరని ఈ తల్లీకూతురు మరోసారి నిరూపించారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  

Updated Date - 2022-05-20T18:20:29+05:30 IST