UK PM Race: దూసుకెళ్తున్న Rishi Sunak.. తొలి రౌండ్‌లో ఆధిక్యం

ABN , First Publish Date - 2022-07-14T13:07:28+05:30 IST

బ్రిటన్‌ ప్రధాన మంత్రి ఎన్నికల రేసులో భారత మూలాలున్న రిషీ సునాక్‌ ఆధిక్యంలో ఉన్నారు. కన్సర్వేటివ్‌ పార్టీ అధ్యక్షుడు, బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ స్థానాన్ని భర్తీ చేసేదెవరనేది తేల్చేందుకు ఎన్నికలు మొదలయ్యాయి.

UK PM Race: దూసుకెళ్తున్న Rishi Sunak.. తొలి రౌండ్‌లో ఆధిక్యం

తొలి రౌండ్‌లో 88 ఓట్లతో సునాక్‌కు ఆధిక్యం

పెన్నీ మోర్డాంట్‌, ట్రస్‌ లిజ్‌ నుంచి గట్టిపోటీ !  

న్యూఢిల్లీ, జూలై 13: బ్రిటన్‌ ప్రధాన మంత్రి ఎన్నికల రేసులో భారత మూలాలున్న రిషీ సునాక్‌ ఆధిక్యంలో ఉన్నారు. కన్సర్వేటివ్‌ పార్టీ అధ్యక్షుడు, బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ స్థానాన్ని భర్తీ చేసేదెవరనేది తేల్చేందుకు ఎన్నికలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల తొలి రౌండ్‌లో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడైన   రిషీ సునాక్‌కు 88 ఓట్లు వచ్చాయి. పెన్నీ మోర్డాంట్‌(67 ఓట్లు), ట్రస్‌ లిజ్‌(50 ఓట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆర్థిక మంత్రి నదిమ్‌ జహావి, మాజీ మంత్రి జెర్మీ హంట్‌ పోటీ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. భారత మూలాలున్న మరో ఎంపీ సుఎల్లా బ్రేవార్మన్‌ మాత్రం పోటీలో కొనసాగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం బోరిస్‌ స్థానాన్ని భర్తీ చేసే వారి పేరును సెప్టెంబర్‌ 5న ప్రకటిస్తారు. కాగా, ప్రధాని రేసులో నిలిచే అభ్యర్థులకు కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి. పలు రౌండ్లలో జరిగే ఓటింగ్‌లో కనీసం 30 ఓట్లు సాధించని అభ్యర్థులు పోటీ నుంచి ఎలిమినేట్‌ అవుతారు. ఇలా చివరకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారిలోంచి ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు. 

Updated Date - 2022-07-14T13:07:28+05:30 IST