Twitter: ట్విట్టర్‌కు భారత సంతతి టాప్ ఎగ్జిక్యూటివ్ బిగ్ షాక్..!

ABN , First Publish Date - 2022-08-27T18:13:53+05:30 IST

భారత సంతతికి (Indian origin) చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ (executive) సందీప్ పాండే (Sandeep Pandey) ట్విట్టర్‌కు గట్టి షాకిచ్చారు.

Twitter: ట్విట్టర్‌కు భారత సంతతి టాప్ ఎగ్జిక్యూటివ్ బిగ్ షాక్..!

ఎన్నారై డెస్క్: భారత సంతతికి (Indian origin) చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ (executive) సందీప్ పాండే (Sandeep Pandey) ట్విట్టర్‌కు గట్టి షాకిచ్చారు. ఆ సంస్థతో ఉన్న పదేళ్ల బంధాన్ని తెంచుకున్నారు. మెటా (Meta)లో చేరుతున్నట్లు. కాగా, ఇప్పటివరకు ట్విట్టర్‌ (Twitter)లో ఇంజనీరింగ్ విభాగానికి సందీప్ ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. 2012లో ట్విట్టర్‌లో ఉద్యోగంలో చేరినా సందీప్.. దశాబ్దం పాటు అందులోనే వివిధ హోదాల్లో పని చేశారు. సెంట్రల్ మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా ఫ్లాట్‌ఫారమ్‌కు నేతృత్వం వహించారు. 


సందీప్ పాండే.. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఐబీఎం ఇండియా రీసెర్చ్ ల్యాబ్, గూగుల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. యాహూలోనూ (Yahoo) పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత 2012లో ట్విట్టర్‌లో స్టాఫ్ ఇంజనీర్‌గా చేరారు. అనతికాలంలోనే ఇంజనీరింగ్‌‌ విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా, రెవెన్యూ సైన్స్‌కు హెడ్‌గా, బ్రాండ్, వీడియో టీమ్‌కి నాయకత్వం వహించారు. ఇక మెటాలో (ఫేస్‌బుక్) చేరిన తర్వాత కృత్రిమ మేథ (Artificial intelligence), మెషీన్ లెర్నింగ్ టీమ్‌లతో కలిసి పనిచేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ట్విట్టర్ సీఈఓగా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ (Parag Agarwal) ఉన్న విషయం తెలిసిందే. సందీప్ పాండే నిష్క్రమణపై పరాగ్ ఎలా స్పందిస్తారో చూడాలి. 



Updated Date - 2022-08-27T18:13:53+05:30 IST