ఏఎస్‌ఐకి ఇండియన పోలీస్‌ మెడల్‌

ABN , First Publish Date - 2022-01-26T06:06:53+05:30 IST

కడప టూటౌనలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న పేరూరు భాస్కర్‌ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది జిల్లాలో భాస్కర్‌ ఒక్కరికే వరించింది. కడప ఉక్కాయపల్లెకు చెందిన భాస్కర్‌ (పీసీ నెం. 2456) 1987 బ్యాచకు చెందిన వారు.

ఏఎస్‌ఐకి ఇండియన పోలీస్‌ మెడల్‌
ఇండియన పోలీసు మెడల్‌కు ఎంపికైన భాస్కర్‌

కడప(క్రైం), జనవరి 25 : కడప టూటౌనలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న పేరూరు భాస్కర్‌ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది జిల్లాలో భాస్కర్‌ ఒక్కరికే వరించింది. కడప ఉక్కాయపల్లెకు చెందిన భాస్కర్‌ (పీసీ నెం. 2456) 1987 బ్యాచకు చెందిన వారు. కడప జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహించారు. 2013లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది కడప వనటౌనలో విధులు నిర్వహించారు. నజియాబాషా అనే బాలుడిని కొందరు కిడ్నాప్‌ చేసి సిద్దవటం పరిఽధిలో హత్య చేశారు. కడప వనటౌనలో పనిచేసేటపుడు ఈ కేసు ఛేదనలో ఈయన మంచి ప్రతిభ కనబరచి నిందితుడిని పట్టుకున్నారు. 2016లో ఏఎస్‌ఐగా పదోన్నతి పొంది లక్కిరెడ్డిపల్లెలో విధులు నిర్వహించారు. అక్కడి నుంచి బదిలీపై స్పెషల్‌ బ్రాంచకు వచ్చి టూటౌనలో అటాచ్డ ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈయన అనంతపురం ఎస్‌ఐ ట్రైనింగ్‌ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. తనకు ఈ అవార్డు రావడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తన విశేష సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇండియన పోలీస్‌ మెడల్‌కు ఎంపిక కావడంపై ఎస్పీ కేకేఎన అన్బురాజనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 


Updated Date - 2022-01-26T06:06:53+05:30 IST