రైళ్ల సమయపాలనకు రైల్వేశాఖ నూతన విధానం!

ABN , First Publish Date - 2021-09-16T15:06:09+05:30 IST

రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ...

రైళ్ల సమయపాలనకు రైల్వేశాఖ నూతన విధానం!

న్యూఢిల్లీ: రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ మరో నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం లింక్ ఎక్స్‌ప్రెస్, స్లీపర్ కోచ్‌ల సంఖ్యను స్థిరంగా ఉంచనున్నారు. తద్వారా ఏ రైలుకైనా అదనంగా కోచ్‌లను చేర్చడం లేదా కోచ్‌లను తగ్గించడం లాంటివి చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధానం వలన సమయం ఆదా అవుతుంది. ఫలితంగా రైళ్లు నిర్ణీత సమయాలకే రాకపోకలు సాగించగలుగుతాయి. 


ముందుగా ఉత్తర రైల్వేలోని ఎనిమిది రైళ్లకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం నూతన రైల్వే టైం టేబుల్‌ను కూడా రూపొందిస్తున్నారు. రైల్వేశాఖలో గత కొన్నేళ్లుగా అక్టోబరులో రైల్వే టైమ్‌టేబుల్ రూపొందించి, ప్రకటిస్తూ వస్తోంది. కరోనా కారణంగా గత ఏడాది రైల్వే టైమ్ టేబుల్ ప్రకటించలేదు. అయితే ఈ ఏడాది నూతన రైల్వే టైమ్‌టేబుల్ ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికితోడు త్వరలో రైళ్ల ఛార్జీలలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Updated Date - 2021-09-16T15:06:09+05:30 IST