భారత startupsపై ఒత్తిడి.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 10 వేల ఉద్యోగాలు మటాష్!

ABN , First Publish Date - 2022-06-25T02:16:17+05:30 IST

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలూ కుదేలయ్యాయి. అది చాలదన్నట్టు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత నష్టం కలిగిస్తోంది

భారత startupsపై ఒత్తిడి.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 10 వేల ఉద్యోగాలు మటాష్!

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలూ కుదేలయ్యాయి. అది చాలదన్నట్టు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత నష్టం కలిగిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్టార్టప్ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఆయా కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వారు ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత స్టార్టప్ కంపెనీలు దాదాపు 10 వేల మంది ఉద్యోగులను ఇళ్లకు పంపించాయి. 


ఇది కూడా చదవండి..

గుడిలో ఇచ్చిన తీర్థంతోపాటు పొరపాటున కృష్ణుడి విగ్రహాన్ని కూడా మింగేసిన భక్తుడు.. డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూస్తే..


Inc42 విశ్లేషణ ప్రకారం , ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, దేశవ్యాప్తంగా 27 స్టార్టప్‌ కంపెనీలు కనీసం 10 వేల మంది ఉద్యోగలను ఇళ్లకు పంపించాయి. `ఓలా`, `బ్లింకిట్`, `వేదాంతు`, `కార్స్ 24`, `యారీ` వంటి స్టార్టప్‌లు తమ ఉద్యోగుల్లో భారీ కోత విధించాయి. ఐరోపాలో యుద్ధం, మాంద్యం భయాలు, ఫెడ్ రేట్ల పెంపు, రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం స్టార్టప్‌లపై ఒత్తిడి పెంచుతున్నాయి. పెట్టుబడిదారుల ఒత్తిడి మేరకు అన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్‌కు అంగీకరిస్తున్నాయి. అందువల్ల పలు కంపెనీలు ఇప్పటికే 10 వేల మందిని తీసేశాయి. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఉద్యోగుల తొలగింపు సంఖ్య 60,000కు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు .

Updated Date - 2022-06-25T02:16:17+05:30 IST