ఆసుపత్రి నుంచి డిశ్చార్జైన హర్‌జ్యోత్ సింగ్.. ఆర్థిక సహాయం కోసం కుటుంబ సభ్యుల అభ్యర్థన

Published: Wed, 30 Mar 2022 18:13:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆసుపత్రి నుంచి డిశ్చార్జైన హర్‌జ్యోత్ సింగ్.. ఆర్థిక సహాయం కోసం కుటుంబ సభ్యుల అభ్యర్థన

ఎన్నారై డెస్క్: రష్యా సైనికులు జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ భారతీయ విద్యార్థి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఫిబ్రవరి చివరి వారంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత విద్యార్థి హర్‌జ్యోత్ సింగ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను వీడాలనుకున్నాడు. కారులో ఎల్వివ్‌కు బయల్దేరాడు. ఇదే సమయంలో హర్‌జ్యోత్ సింగ్ కారును రష్యా సైనికులు అడ్డగించి.. కారుపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో హర్‌జ్యోత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని.. మార్చి 7న ప్రత్యేక విమానంలో అధికారులు ఇండియాకు తరలించారు. అంతేకాకుండా ఇక్కడి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందే ఏర్పాట్లు చేశారు. దీంతో  కొన్ని రోజులుగా ఆర్మీ ఆసుపత్రిలోనే చికిత్స పొందిన హర్‌జ్యోత్ సింగ్.. మంగళవారం డిశ్చార్జ్ అయ్యాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తమ కుటుంబాన్ని ఆర్థికంగా అండగా నిలవాలని హర్‌జ్యోత్ సింగ్ కుటుంబ సభ్యులు భారత ప్రభత్వాన్ని వేడుకుంటున్నారు. తదుపరి చికిత్స కోసం సాయం చేయాలని కోరుతున్నారు. 



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

ఓపెన్ హార్ట్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.