వర్క్ వీసాలపై బ్రిటన్ కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2021-03-07T01:05:17+05:30 IST

యూకే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2020-21కి సంబంధించి వర్క్ వీసాల (పోస్ట్ స్టడీ వర్క్ వీసా) కోసం జూలై 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వెల్లడించింది. యూకేలోని గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చ

వర్క్ వీసాలపై బ్రిటన్ కీలక ప్రకటన!

లండన్: యూకే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2020-21కి సంబంధించి వర్క్ వీసాల (పోస్ట్ స్టడీ వర్క్ వీసా) కోసం జూలై 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వెల్లడించింది. యూకేలోని గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థులు ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. జాబ్ ఆఫర్ లెటర్, సాలరీకి సంబంధించిన అంశాలను దరఖాస్తులో పేర్కొనాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యూకేలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ వర్క్ వీసాను పొందడం ద్వారా ఉద్యోగం లేనప్పటికీ కనీసం రెండేళ్లపాటు అక్కడే నివసించేందుకు వీలు కలుగుతుందని చెప్పింది. ఈ రెండేళ్లలో విద్యార్థులు తమకు సంబంధించిన రంగాల్లో ఉద్యోగం పొంది.. తమ జీవితాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా.. పీహెచ్ పూర్తి చేసిన విద్యార్థులకు మూడేళ్ల కాలపరిమితితో ఈ వర్క్ వీసాలను జారీ చేయనున్నట్టు తెలిపింది. కాగా.. యూకే ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. బ్రిటన్‌లో చదువు పూర్తి చేసుకుని.. అక్కడే స్థిరపడాలనుకునే విద్యార్థలుకు ఇది సదవకాశం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.  


Updated Date - 2021-03-07T01:05:17+05:30 IST